Rat Photoshoot: మూషిక భోగం.. ఫొటోలకు మనుషులు కూడా ఇలా ఫోజులివ్వరేమో!

ఎలుకలు ఫొటోలకు ఫోజులివ్వడం ఎప్పుడైనా చూశారా? అది కూడా ఓ టెడ్డీబేర్ ను పట్టుకుని. మనుషులకే అసూయకలిగేలా ఎంత క్యూట్ గా ఫోజులిచ్చిందో చూడండి..

Rat Photoshoot: మూషిక భోగం.. ఫొటోలకు మనుషులు కూడా ఇలా ఫోజులివ్వరేమో!
Rat

Updated on: May 25, 2022 | 12:02 PM

adorable pictures of rats: ఎలుకలను అసహ్యించుకోనివారు ఉండరేమో ఈ జిందగీలో! కొంతమంది వాటిని ఆహారంగా, ఎంతో ఇష్టంగా తింటారు. ఐతే యూకేకి చెందిన జెస్సికా ఫ్లోరెన్స్ ఫొటోగ్రాఫర్ ఓ అడుగు ముందుకేసి ఎలుకలను ముద్దుముద్దుగా పెంచుకుంటుంది. అంతటితో ఆగకుండా భిన్న యాంగిళ్లలో ఫొటోలు కూడా తీసి ప్రదర్శనకు పెట్టింది. ఇక మూషికంగారేమో టెడ్డీబేర్‌ బొమ్మతో.. రకరకాల స్టిల్స్‌ ఇస్తూ ఫొటోలు దిగడం కనిపిస్తుంది. నమ్మబుద్ధికావట్లేదా.. ఐతే ఈ ఫొటోలవైపు ఓ లుక్కేయండి..

 

దుప్పటి లో వెచ్చగా నిద్రపోతున్నట్టు..

టెడ్డీ బేర్ బొమ్మతో ఫోజు లిస్తూ..

 

ఇవి కూడా చదవండి

టెడ్డీ బేర్‌ని కాలివేళ్లతో పట్టుకుని..

 

నిజానికివి ఫోటోషాప్ ద్వారా చేసినట్లు కనిపిస్తున్నా.. ఫొటోగ్రాఫర్‌ స్వయంగా తీసిన ఫొటోలివి..

 

జెస్సికా ఫ్లోరెన్స్ (ఫొటోగ్రాఫర్) కోరిన విధంగా కూర్చుని ఎలుక పోజులివ్వడం మాత్రం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఎలుక ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us