Zaouli mask dance: ప్రపంచంలోనే అత్యంత కష్టమైన డ్యాన్స్.. స్టెప్స్ వేగం చూస్తే షాక్ అవ్వాల్సిందే..

ఇది ప్రపంచంలోనే అత్యంత కష్టమైన నృత్యం, డ్యాన్స్ చేస్తున్న వేగాన్ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. వైరల్ వీడియోలో పశ్చిమ ఆఫ్రికాలోని కోట్ డి ఐవోయిర్ కి చెందిన సాంప్రదాయ జౌలి నృత్యాన్ని ప్రదర్శిస్తున్న వ్యక్తులను చూడవచ్చు. కళాకారుడు తలపై పెద్ద కొమ్ములున్న కిరీటం వంటి దానిని ధరించి.. ఎవరూ ఊహించలేనంత వేగంగా తన పాదాలను కదిలిస్తూ నృత్యం చేస్తున్నాడు.

Zaouli mask dance: ప్రపంచంలోనే అత్యంత కష్టమైన డ్యాన్స్.. స్టెప్స్ వేగం చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Zaouli Mask Dance

Updated on: May 06, 2025 | 8:31 PM

జౌలీ వెస్ట్ ఆఫ్రికాకి చెందినా అత్యంత ప్రసిద్ధ నృత్యం. ఈ డ్యాన్స్ కి సంబంధించిన పాత వీడియో మళ్ళీ సోషల్ మీడియాలో తుఫాను సృష్టిస్తోంది. దీనిని ‘ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన నృత్యం’గా కూడా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ నృత్యం అద్భుతమైన వేగం, క్లిష్టమైన ఫుట్‌వర్క్‌కు ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా తలపై భారీ కొమ్ములున్న కిరీటం ధరించడం వల్ల దీన్ని చేయడం మరింత కష్టమవుతుంది.

వైరల్ అవుతున్న వీడియోలో పశ్చిమ ఆఫ్రికాలోని కోట్ డి ఐవోయిర్ కి చెందిన సాంప్రదాయ జౌలి నృత్యాన్ని ఒక వ్యక్తి ప్రదర్శిస్తున్నట్లు చూడవచ్చు. ఆ కళాకారుడు ఎవరూ ఊహించలేనంత వేగంగా తన పాదాలను కదిలిస్తూ నృత్యం చేస్తున్నాడు. ఈ వేగం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

జావోలి నృత్యం 1950లలో సృష్టించబడిందని చెబుతారు. ఈ డ్యాన్స్ చేయడంలో ప్రావీణ్యం సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది. ఇది గురో జాతికి చెందిన వారికి విలువైన వారసత్వం. దీనిని సంరక్షించడం చాలా ముఖ్యం. 2017లో దీనిని యునెస్కో మానవత్వం.. అవ్యక్త సాంస్కృతిక వారసత్వ ప్రతినిధి జాబితాలో చేర్చారు.

 

ఈ నృత్యంలో దివంగత పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ చేసిన నృత్య రీతుల్లో కొన్నిటిని నెటిజన్లు చూస్తున్నారు. ఇందులో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే జాక్సన్ ఎల్లప్పుడూ విభిన్న సంస్కృతుల నుంచి ప్రేరణ పొంది దానిని తనదైన శైలిలో ప్రజెంట్ చేసేవాడు. జాలీ మాస్క్ కూడా మైఖేల్ జాక్సన్ కు స్ఫూర్తినిచ్చి ఉంటే.. అది నిజంగా సాంప్రదాయ నృత్యంలోని అందం, బలానికి నిదర్శనం అని చెప్పవచ్చు.

 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..