ఈ దృశ్యాలు భయానకం.. ఎల్పీజీ ట్యాంకర్‌ మంటల్లో 11మంది సజీవ దహనం..కాలిబూడిదైన 40 వాహనాలు..

|

Dec 22, 2024 | 12:23 PM

ట్యాంకర్‌లో పేలుడు సంభవించడంతో మండే వాయువు పెనుగాలిని సృష్టించింది. రసాయనాలు భారీగా రోడ్డుపై పారాయి. దీంతో ప్రమాదం మరింత ఎక్కువైంది. గ్యాస్ కారణంగా 3 డజన్లకు పైగా వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ఘోర అగ్నిప్రమాదానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.

ఈ దృశ్యాలు భయానకం.. ఎల్పీజీ ట్యాంకర్‌ మంటల్లో 11మంది సజీవ దహనం..కాలిబూడిదైన 40 వాహనాలు..
Ajmer Accident
Follow us on

జైపూర్-అజ్మీర్ హైవేపై డిసెంబర్ 20వ తేదీ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. సీఎన్‌జీ ట్యాంకర్‌ మరో ట్రక్కును ఢీకొనడంతో 9 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో 35 మంది కాలిపోయారు. క్షతగాత్రులందరినీ ఎస్‌ఎంఎస్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ పేలుడు చాలా తీవ్రంగా ఉంది. దాని శబ్దం చాలా కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది. భారీ మంటలను చూసిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్‌ అవుతోంది.

ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ ఫుటేజీ ప్రకారం, సీఎన్‌జీ ట్యాంకర్ ట్రాఫిక్ పాయింట్ వద్ద యు-టర్న్ తీసుకుంటుండగా వేగంగా వచ్చిన ట్రక్ దానిని ఢీకొట్టింది. అనంతరం ట్యాంకర్‌లో భారీ పేలుడు సంభవించి చుట్టుపక్కల మంటలు చెలరేగాయి. ఢీ కొట్టడంతో దాదాపు 700 మీటర్ల పరిధిలో ఉన్న 40 వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఇందులో ట్రక్కులు, బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ట్యాంకర్‌లో పేలుడు సంభవించడంతో మండే వాయువు పెనుగాలిని సృష్టించింది. రసాయనాలు భారీగా రోడ్డుపై పారాయి. దీంతో ప్రమాదం మరింత ఎక్కువైంది. గ్యాస్ కారణంగా 3 డజన్లకు పైగా వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ఘోర అగ్నిప్రమాదానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..