క్యాట్‌వాక్‌తో ర్యాంపుపై సందడి చేసిన పిల్లి… ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా…?

| Edited By:

May 05, 2019 | 12:18 PM

క్యాట్‌వాక్.. అంటే ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. న్యూ డిజైన్లను ధరించి.. మోడల్స్ ర్యాంప్‌పై వచ్చి వయ్యారంగా క్యాట్ వాక్ చేస్తూ వాటిని ప్రదర్శిస్తారు. క్యాట్ వాక్ అంటేనే పిల్లి నడక అని పేరు. అయితే ఆఫ్రికాలోని మొరాకోలో ఓ వింత చోటుచేసుకుంది. మరకేష్ నగరంలో క్రిస్టియన్ డియోర్ క్రూయిజ్‌ షో జరుగుతోంది. మోడల్స్ న్యూ డిజైన్లను ప్రదర్శిస్తూ… ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేస్తూ ముందుకెళ్తున్నారు. అదే సమయంలో… ఓ క్యాట్ (పిల్లి) ర్యాంపు పైకి […]

క్యాట్‌వాక్‌తో ర్యాంపుపై సందడి చేసిన పిల్లి... ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా...?
Follow us on

క్యాట్‌వాక్.. అంటే ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. న్యూ డిజైన్లను ధరించి.. మోడల్స్ ర్యాంప్‌పై వచ్చి వయ్యారంగా క్యాట్ వాక్ చేస్తూ వాటిని ప్రదర్శిస్తారు. క్యాట్ వాక్ అంటేనే పిల్లి నడక అని పేరు. అయితే ఆఫ్రికాలోని మొరాకోలో ఓ వింత చోటుచేసుకుంది. మరకేష్ నగరంలో క్రిస్టియన్ డియోర్ క్రూయిజ్‌ షో జరుగుతోంది. మోడల్స్ న్యూ డిజైన్లను ప్రదర్శిస్తూ… ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేస్తూ ముందుకెళ్తున్నారు. అదే సమయంలో… ఓ క్యాట్ (పిల్లి) ర్యాంపు పైకి ఎంటరైంది. మోడల్స్‌ని చూసి ఏ మాత్రం భయపడని ఆ పిల్లి… క్యాట్ వాక్ చేసింది. అంతే… అందరూ ఆశ్చర్యపోయారు. వావ్ ఇట్సే క్యాట్ వాక్ అంటూ ఆ పిల్లిని తమ మొబైల్ కెమెరాల్లో బంధించారు. అనుకోని అతిథిలా వచ్చిన ఆ క్యాట్… మోడల్స్ పక్క నుంచీ వాక్ చేస్తూ… చివరకు ఆడియన్స్ దగ్గరకు వెళ్లింది. దాంతో మోడల్స్, డ్రెస్సెస్ కంటే… ఆ పిల్లే సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయిపోయింది. ఆ తర్వాత ర్యాంపు పక్కన కూర్చున్న ఓ యువతి వద్దకు వెళ్లి ఆమె డ్రెస్‌పై టాయిలెట్ పోసి ఎంచక్కా వెళ్లిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.