Viral: ఇదిగోండి మరో ఆణిముత్యం.. ఎగ్జామ్‌లో టీచర్‌ని రఫ్పాడించాడు..

|

Sep 19, 2024 | 3:07 PM

ప్రస్తుతం ఈ కిర్రాక్ స్టూడెంట్ ఆన్సర్ మీమ్ రూపంలో నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. మా బాల్యాన్ని గుర్తుచేశావ్, మా ఫ్రెండ్ ఇలానే రాస్తే టీచర్ పిచ్చి కొట్టుడు కొట్టింది అంటూ తమ లైఫ్‌లోని అనుభవాలను పంచుకుంటున్నారు.

Viral: ఇదిగోండి మరో ఆణిముత్యం.. ఎగ్జామ్‌లో టీచర్‌ని రఫ్పాడించాడు..
Student Funny Answer
Follow us on

బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అనగానే సహజంగానే వాళ్లు కిలాడీలు అనే ఫీలింగ్ ఉంటుంది. అదేంటో తెలియదు కానీ.. స్కూల్లో, కాలేజ్‌లో బ్యాక్ బెంచ్‌లో కూర్చునేవాళ్లే పెద్దయ్యాక ఎక్కువగా సక్సెస్ అవతుంటారు. వివిధ రంగాల్లో అసమాన్య ప్రతిభ కనబరుస్తూ ఉంటారు. అయితే బ్యాక్ బెంచ్‌లో కూర్చునే అందరూ చదవరు అనుకోడానికి లేదు. వాళ్లలో కొందరు చాలా క్రియేటివ్‌గా ఆలోచిస్తారు. నెలకు ఓసారి లేదా ఎగ్జామ్స్ ముందు బుక్స్ పట్టి కూడా క్లాస్ టాపర్‌గా నిలిస్తారు. బట్టి విధానం కాకుండా సబ్జెక్ట్‌ను ప్రాక్టికల్‌గా అర్థం చేసుకోవడమే ఇందుకు రీజన్ కావొచ్చు.

అలానే.. మీ స్కూల్ లేదా కాలేజ్‌లో ఎగ్జామ్స్ పెట్టినప్పుడు.. ఆన్సర్స్ తెలియక కొందరు తమకు తోచింది రాస్తుంటారు. కొందరు అయితే మరీ నవ్వు తెప్పించేలా ఆన్సర్స్ రాస్తూ టీచర్స్‌కు అడ్డంగా దొరికిపోతూ ఉంటారు. ఆ ఘటనలు గుర్తుకువస్తే ఇప్పుడు ఫన్నీ అనిపిస్తూ ఉంటుంది. అప్పటి రోజులు గుర్తుకు వచ్చి కొంత ఎమోషన్‌కు కూడా లోనవుతూ ఉంటాం.

తాజాగా ఓ ఇస్మార్ట్ స్టూడెంట్ ఇంగ్లీషులో రాసిన ఆన్సర్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. దీనిపై రకరకాల మీమ్స్ కూడా వస్తున్నాయి. ఇచ్చిన పదాల నుంచి సరితూగేలా వాక్యాలు రాయమని ఇంగ్లీషులో నాలుగు పదాలు ఇచ్చారు.

  1. టీచర్ — మై టీచర్ ఈజ్ క్రిమినల్
  2. పోలీస్ —- పోలీస్, ప్లీజ్ అరెస్ట్ హిట్
  3. పైలట్ —- పైలెట్, ప్లీజ్ ల్యాండ్ ప్లెయిన్ ఆన్ మై టీచర్ హెడ్
  4. డాక్టర్ — డాక్టర్, ప్లీజ్ గివ్ పాయిజన్ ఇంజక్షన్ టూ మై టీచర్

అంటూ ఇంగ్లీషులో సమాధానాలు రాశాడు ఆ కిర్రాక్ స్టూడెంట్. అతని రాసిన వాక్యాల్లో.. ఎక్కడా తప్పు లేదు. అన్నీ కరెక్ట్‌గా రాశాడు. అందునా టీచర్‌పై తనకున్న కసిని కూడా ఆ సమాధానంలో బేషుగ్గా పొందుపొరిచాడు. ఇది చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ఒరెయ్.. ఆ టీచర్‌ని చంపేవరకు నువ్వు నిద్రపోయేలా లేవుగా అని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. నువ్వు ఇప్పుడే ఇలా ఉన్నావంటే.. పెద్దయ్యాక నువ్వు ఊహించడమే కష్టం అని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు.

Also Read: ‘ఇదిగోరా జాతిరత్నం’.. ద్వీపం అంటే ఏంటో రాయమంటే..?

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..