ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోవడంతో ప్రపంచం నలుమూలలా జరిగిన వింతలు, విశేషాలు చిటికెలో ఇంటర్నెట్‌లో దర్శనమిస్తున్నాయి. ఆ వీడియోలు క్షణాల్లో వైరల్‌గా మారుతున్నాయి. అలాంటివి కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తాజాగా ఈ కోవకు చెందిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటో చూసేద్దాం పదండి.!
చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ‘స్పైడర్‌మాన్’ మూవీస్‌ను ఇష్టపడతారన్న సంగతి తెలిసిందే. ఇక అందులో డ్రోన్‌లాంటి పరికరంపై నిల్చుని ఎగిరే విలన్ ‘గ్రీన్ గాబ్లిన్’ మీకు గుర్తుండే ఉంటాడు.! ఆ గ్రీన్ గాబ్లిన్ రియల్‌గా వచ్చాడా? అన్నట్లుగా ఓ వ్యక్తి తాజాగా డ్రోన్‌పై నిల్చోని, అమాంతం గాల్లోకి ఎగిరాడు. దానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
అమెరికాలోని న్యూయార్క్ ప్రాంతంలో హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి డ్రోన్‌పై నిల్చోని, అమాంతం గాల్లోకి ఎగిరాడు. 10 అడుగుల ఎత్తులో డ్రోన్ కెమెరాతో ఎగిరాడు. ఇందుకు సంబంధించిన వీడియోను మాజీ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ విజువల్స్‌ను జూన్ 19వ తేదీ ఉదయం 5 గంటల సమయంలో తీసినట్లుగా తెలుస్తోంది. ఇక ఆ హోవర్‌బోర్డు ఎయిర్ క్రాఫ్ట్‌పై నిల్చుని విన్యాసాలు చేసిన వ్యక్తి హంటర్ కోవాల్ద్‌గా అనే యూట్యూబర్ అని గుర్తించారు. కాగా, ఈ వీడియో గురించి న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ”తమకు వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం అందిందని.. దర్యాప్తు చేస్తున్నామని” అన్నారు.
Also Read:
ఈ పండుతో డయాబెటీస్‌కు చెక్ పెట్టొచ్చు.. ప్రపంచంలోనే తియ్యటి ఫ్రూట్.. ప్రత్యేకత ఇదే.!
ఈ కొండచిలువను చూసేందుకు ఎగబడుతున్న జనాలు.. వీడియో చూస్తే మీరు ఫిదా కావాల్సిందే.!
వీడెవడండీ బాబు.! ‘క్రిస్ గేల్’ తమ్ముడులా .. 10 బంతుల్లో 50 పరుగులు బాదేశాడు..
చెట్టు తొర్రలో భారీ గుడ్లు.. వాటిని పగలగొట్టి చూడగా స్థానికులు హడల్.!