బాబోయ్.. బంగారంతో లోదస్తులు! మహిళా ఎంపీ ఇంట్లో దొరికిన రూ. 490 కోట్ల క్యాష్, గోల్డ్‌!? వైరల్ వార్త చూస్తే..

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఎలాంటి నిజానిజాలు తెలుసుకోకుండా వార్తలు దావానంలా వ్యాపించడం సర్వసాధారణం అయిపోయింది. తాజాగా, ఒక మహిళా ఎంపీ సంబంధించిన ఒక భయంకరమైన వార్త ఇంటర్నెట్‌లో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆమె నివాసంపై దాడి చేశారని, అక్కడ కొండల్లా పేరుకుపోయిన నోట్ల కట్టలు, భారీగా బంగారం లభ్యమయ్యాయని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎవరా ఎంపీ..?ఇంటర్‌నెట్‌లో వచ్చిన కథనం ప్రకారం ఈ వైరల్ పోస్టుల వెనుక ఉన్న అసలు వాస్తవం (Fact Check) ఏంటో ఇప్పుడు చూద్దాం.

బాబోయ్.. బంగారంతో లోదస్తులు! మహిళా ఎంపీ ఇంట్లో దొరికిన రూ. 490 కోట్ల క్యాష్, గోల్డ్‌!? వైరల్ వార్త చూస్తే..
Iraqi Mp Viral News

Updated on: Jul 02, 2026 | 1:04 PM

ప్రస్తుతం ఇరాక్ రాజకీయాలు అవినీతి వ్యతిరేక ప్రచారంతో హోరెత్తుతున్నాయి. మహిళా ఎంపీ హింద్ అల్-అబ్బాసి ఇంటిపై దాడి జరిగిందంటూ, స్వాధీనం చేసుకున్న వస్తువుల జాబితాతో కూడిన సోషల్ మీడియా వార్తలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. ఆమె ఇంట్లో 60 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 490 కోట్లు) నగదు, 27 కిలోల స్వచ్ఛమైన బంగారం, బంగారు ఎంబ్రాయిడరీ చేసిన బ్రాలు, ప్యాంటీలు వంటి విలాసవంతమైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అసలు సోషల్ మీడియాలో ప్రచారం ఏమిటి?

వైరల్ అవుతున్న పోస్టుల ప్రకారం.. ఇరాక్ యాంటీ కరప్షన్ ఆపరేషన్‌లో భాగంగా ఎంపీ హింద్ అల్-అబ్బాసి ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో సుమారు 60 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 490 కోట్లు) నగదు, 27 కేజీల స్వచ్ఛమైన బంగారం లభించాయని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆమె బెడ్‌రూమ్‌లో రూ. కోట్ల విలువైన బంగారు దారాలతో తయారు చేసిన లోదుస్తులు (Golden Bra & Panty) కూడా దొరికాయంటూ కొన్ని ఫొటోలు, వీడియోలను జత చేసి నెటిజన్లు విపరీతంగా షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఫ్యాక్ట్ చెక్ – అసలు నిజం ఏమిటి?:

అంతర్జాతీయ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగాలు ఈ వైరల్ వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించగా, ఈ వార్త పూర్తిగా ఫేక్‌ న్యూస్‌ (Fake News) అని తేలింది. వైరల్ పోస్ట్‌లో చూపిస్తున్న నోట్ల కట్టల వీడియో నిజానికి ఇరాక్ ఎంపీ ఇల్లు కాదు. అది కొన్ని నెలల క్రితం మరో దేశంలో అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా, మనీలాండరింగ్ ముఠాలపై పోలీసులు జరిపిన దాడులకు సంబంధించిన పాత వీడియో. బంగారు లోదుస్తుల ఫొటో కూడా ఇప్పటిది కాదు. అదొక ప్రసిద్ధ ఫ్యాషన్ షో, విదేశీ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచిన డిజైనర్ పీస్. దానికి, ఇరాక్ ఎంపీకి ఎలాంటి సంబంధం లేదని తేలింది.

ఇరాక్ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండే హింద్ అల్-అబ్బాసి ప్రతిష్టను, ఆమె రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయడానికే ప్రత్యర్థులు కావాలనే ఈ విధంగా తప్పుడు వార్తలను, పాత ఫొటోలను ఎడిట్ చేసి వదిలినట్లు దర్యాప్తులో స్పష్టమైంది. ఇరాక్ ప్రభుత్వ అధికారిక సంస్థలు కూడా అలాంటి దాడులు ఏవీ జరగలేదని ధృవీకరించాయి. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి సంచలన వార్త నిజం కాదని చెప్పడానికి ఈ ఘటనే ఒక పెద్ద ఉదాహరణ. కాబట్టి, ఇలాంటి ఫేక్ పోస్టులను నమ్మి ఇతరులకు షేర్ చేయవద్దని డిజిటల్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us