Trending: ఐఫోన్ కొనుక్కోవాలని చాలామందికి ఆశ ఉంటుంది. ఆ క్లాస్ట్లీ ఫోన్ చేతిలో ఉంటే ఆ దర్జా వేరు. అయితే తాజగా ఐఫోన్ ఓ సైనికుడి ప్రాణం కాపాడింది అంటే మీరు నమ్ముతారా..?. నిజమండీ బాబు. ఈ ఘటన జరిగింది ఉక్రెయిన్‌లో. ప్రస్తుతం ఉక్రెయిన్(Ukraine), రష్యా(Russia) మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా రష్యా బలగాలు తూటాల వర్షం కురిపించగా.. ఓ ఉక్రెయిన్ సైనికుడు తన మిలిటరీ బ్యాగులో ఉన్న ఐఫోన్ కారణంగా ప్రాణాలు నిలుపుకోగలిగాడు. ప్రజంట్ ఈ వార్త నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. ఓ బుల్లెట్ అతనివైపు దూసుకెళ్లింది. ఆ సమయంలో సైనికుడి బ్యాగులో ఉన్న 2019 మోడల్ ఐఫోన్ 11ప్రోకు బుల్లెట్ తగిలి అది ధ్వంసం అవ్వడం మీరు ఫోటోలో చూడవచ్చు. అదే బుల్లెట్ నేరుగా ఆ సైనికుడికి తగిలి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది అన్నది నెటిజన్లు చెబుతున్న మాట. ఈ ఘటనపై వారు పెడుతున్న కామెంట్స్ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. “స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగించిన మెటీరియల్‌తో బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ ఎందుకు క్రియేట్ చేయకూడదు? ఇది చాలా ఈజీనే కదా! ” అని ఒకరు కామెంట్ పెట్టారు. “ఐఫోన్ చివరకు ఏదో ఒక పనికి ఉపయోగపడింది!” అని మరొకరు పేర్కొన్నారు.
రష్యా ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌లో “ప్రత్యేక సైనిక చర్య”ని ప్రారంభించింది. ఇప్పటికీ ఈ వార్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అనేక ప్రాంతాలను హస్తగతం చేసుకుంది పుతిన్ సైన్యం. ఉక్రెయిన్ సేన కూడా ఎదురొడ్డి పోరాడుతుంది. శనివారం పలు ప్రాంతాల్లో రష్యా జరిపిన దాడుల్లో 16మంది ఉక్రెయిన్ పౌరులు చనిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. (Source)
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి