మీరెప్పుడైనా సుత్తి తల పాము గురించి విన్నారా.. ఈ పేరే విచిత్రంగా ఉంది కదా.. ఎందుకంటే ఆ పాము తల మేకులు కొట్టే సుత్తిలాగా ఉంటుంది. అందుకే దాన్ని అలా పిలుస్తారు. చూడ్డానికి చిన్నదే కానీ చాలా డేంజర్.. నెమ్మదిగా పాకుతుంది.. దాని శత్రువుల్ని క్షణాల్లో నీరులా మార్చేసి తాగేస్తుంది. ఇది దీని వేట పద్ధతి. జనరల్‌గా ఈ పాము… వానపాముల్ని తింటుంది.. వానపాముని చూడగానే… ఓ రకమైన ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఇదో రకమైన అత్యంత విషపూరితమైన రసాయనం. ఈ రసాయనం తగలగానే… వానపాము ద్రవంలా మారిపోతుంది. అంతే వెంటనే సుత్తి తల పాము… వానపామును పీల్చేసుకుంటుంది. ఇందుకోసం ఈ పాములో ద్రవాలను లాక్కునే కణజాలాలు ఉంటాయి. అవి మెల్లగా పీల్చేస్తాయి. ఈ పాము మనుషులు, పక్షులు, జంతువులకు ఎలాంటి హాని చెయ్యదు. అందువల్ల దీంతో మనకు డైరెక్టుగా ఎలాంటి సమస్యా లేదు.
కానీ ఇవి మనకు పరోక్షంగా హానికరమనే చెప్పాలి. ఎందుకంటే మనకు వానపాములు చాలా ముఖ్యమైనవి. అవి భూమిని గుల్లలుగా చేస్తూ… మొక్కలకు కావాల్సిన పోషకాలు అందేందుకు ఎంతో సాయపడతాయి. అలాంటి వానపాముల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. అందుకే ఈ సుత్తి తల పాము కనిపిస్తే వెంటనే చంపేయడమే మేలు. ఇవి మన దేశంలో అంతగా కనిపించవు కానీ అమెరికా, యూరప్ ఖండాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడి వారు ఈ పాముల్ని చంపుతున్నా… తరచూ ఇవి వస్తూనే ఉన్నాయి. ఇవి తమ ఖండాలపై దండయాత్ర చేస్తున్నాయని అక్కడి పరిశోధకులు అంటున్నారు. ఇవి ఎక్కడి నుంచి ఎలా వస్తున్నాయో తెలుసుకునేందుకు పరిశోధనలు సాగిస్తున్నారు.