Watch Video: డీజే టిల్లుగా మారిన ఈ క్రేజీ ఫెల్లో ఎవరో గుర్తుపట్టారా..? ఆయన తోపు అంతే

|

Nov 14, 2022 | 3:02 PM

మార్కెట్‌లోకి కొత్త డీజే టిల్లు వచ్చాడు. ఈయన ఫారెనర్ అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అభిమానులు ఉన్నారు. ఎవరో మీరు కనిపెట్టేశారా..?

Watch Video: డీజే టిల్లుగా మారిన ఈ క్రేజీ ఫెల్లో ఎవరో గుర్తుపట్టారా..? ఆయన తోపు అంతే
David Warner As Dj Tillu
Follow us on

డీజే టిల్లు బోర్డర్ దాటేసింది. సప్తసముద్రాల అవతల కూడా గెటప్‌లతో అదరగొడుతోంది. డీజే టిల్లు మాస్‌ పీపుల్స్‌ను ఎంత ఆకట్టుకుందో మరోసారి ప్రూవ్‌ అయ్యింది.
ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్‌ ఆండ్రూ వార్నర్‌ డీజే టిల్లు లుక్‌లో దుమ్ము లేపారు. ఆటలో బంతిని బౌండరీకి పంపే సత్తా ఉన్న క్రికెటర్‌, ఒంటి చేత్తే టీమ్‌కు విజయాలు అందించే బ్యాటర్… ఛాన్స్‌ దొరికినప్పుడల్లా టిక్‌టాక్‌, డ్యాన్స్‌, న్యూ గెటప్‌లతో ఫ్యాన్స్‌ని ఎట్రాక్ట్‌ చేస్తుంటారు. అప్పట్లో బాహుబలి, పుష్ప గెటప్‌తో అదరగొట్టిన వార్నర్‌…ఈ సారి డీజే టిల్లు గెటప్‌తో అదరహో అనిపించారు. తెలుగు మూవీస్‌లోని ఫేమస్ క్యారెక్టర్లకు తన ఫేస్ యాడ్ చేసి రీల్స్ చేయడంలో వార్నర్ స్టైలే వేరు.

ఆట తప్ప పాట, గెటప్‌లు ఎప్పుడూ చూడలేదు. బ్యాటర్‌గా తప్ప డ్యాన్సర్‌గా అభిమానులకూ ఆయనలో ఈ కోణం పెద్దగా తెలీదు. కానీ..సన్‌రైజర్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌గా ఉన్నప్పటి నుంచి వార్నర్‌, తెలుగు మూవీస్‌పై ఇంట్రెస్ట్ చూపారు. లాక్‌డౌన్‌లో బుట్టబొమ్మ, అల వైకుంఠపురం, పుష్ప, ఇతర సాంగ్స్‌కి డ్యాన్స్‌ చేసిన వార్నర్‌.. ఇప్పుడు కొత్త లుక్‌లో కనిపించడం ఫ్యాన్స్‌కి కిరాకెక్కిస్తోంది. ఈ గెటప్‌ ప్రజెంట్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

వార్నర్ చేసిన ఈ పోస్ట్‌పై అతని అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. కిర్రాక్ కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప సినిమా పార్ట్ 2లో వార్నర్ హీరోగా నటించాలని ఓ అభిమాని పేర్కొన్నాడు. వార్నర్ భారత పౌరసత్వం తీసుకోవాలని, మీకు ఇక్కడ స్వాగతం పలుకుతామని మరో అభిమాని రాసుకొచ్చాడు.

డేవిడ్ వార్నర్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఈసారి కూడా టీ20 వరల్డ్ కప్‌లో సూపర్ 12 దశలోనే నిష్క్రమించింది. సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. అప్పటి నుంచి వార్నర్‌ను జట్టుకు కెప్టెన్‌గా చేయాలని అతని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి