AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake Video: ఒక్క కాటుతో 100 మందిని చంపగల పామును.. పాప్ కార్న్‌లా నమిలి తినేసింది…

మీకు ఇన్లాండ్ తైపాన్ పాము గురించి తెలుసా... ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటు విషంతో వంద మంది మనుషులను ఖతం చేయగలదు. ఇక ఎలుకల విషయానికి వస్తే.. దాని కాటుకు 2,50,000 మూషికాలు ఫసక్‌. అలాంటి పామును మరో పాము పాప్ కార్న్‌లా కరకరా నమిలి తినేసింది...

Snake Video: ఒక్క కాటుతో 100 మందిని చంపగల పామును.. పాప్ కార్న్‌లా నమిలి తినేసింది...
Snakes Fight
Ram Naramaneni
|

Updated on: Oct 09, 2025 | 6:46 PM

Share

అడవిలో ఒక జీవికి ఆకలి వేసిందంటే.. మరో జీవికి ఆయువు మూడినట్లే కదా..!. ప్రపంచంలో అనేక రకాల పాములు ఇతర పాములను చంపి తింటాయి. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిలో ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన రెండు పాములు ఒకదానితో ఒకటి పోరాడుతున్నాయి. ఒక వైపు ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముగా చెప్పబడే ఇన్లాండ్ తైపాన్, మరొక వైపు ఆస్ట్రేలియాలో అత్యంత ప్రమాదకరమైన పాముగా పరిగణించబడే కింగ్ బ్రౌన్ స్నేక్ ఉన్నాయి.

ఈ పాము పోరాటం సినిమా సన్నివేశానికి ఏమాత్రం తీసిపోదు. వీడియోలో కింగ్ బ్రౌన్ స్నేక్ నెమ్మదిగా ఇన్లాండ్ తైపాన్ వైపుకు చేరుకోవడాన్ని మీరు చూడవచ్చు. కింగ్ బ్రౌన్ దగ్గరకు రావడాన్ని చూసి, ఇన్లాండ్ తైపాన్ కోపంగా దానిపై దాడికి దిగింది. ఇన్లాండ్ తైపాన్ ఒక్క కాటుతో 100 మందిని చంపగలదని చెబుతారు, కానీ దాని విషం కింగ్ బ్రౌన్ దాని విషం పని చేయలేదని వీడియో ద్వారా అర్థమవుతుంది. కింగ్ బ్రౌన్ స్నేక్.. ఇన్లాండ్ తైపాన్ పాముకు ఒక్క ఉదుటన పట్టి.. కరకరా నమిలి మింగేసింది.

వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @AMAZlNGNATURE అనే IDతో షేర్ చేశారు. “ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాము ఇన్‌ల్యాండ్ తైపాన్. ఇది ఒకే కాటుతో 100 మంది మనుషఉలకు చంపేంత విషాన్ని కలిగి ఉంది. అలా పాము కూడా.. కింగ్ బ్రౌన్‌ ఎదర్కోలేక శక్తిహీనంగా మిగిలపోయింది. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే.. మీరు ఎప్పుడైనా పాము ముందు కింగ్ అనే పేరు ఉన్నట్లయితే.. దాని అర్థం అది ఇతర పాములను తింటుంది!” అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ 54 సెకన్ల వీడియోకు ఓ రేంజ్‌లో లైక్స్, కామెంట్స్, షేర్స్ వస్తున్నాయి.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..