AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: జాలీగా హనీమూన్‌కు వెళ్లిన కొత్త జంట.. ఆపై ఫోన్లు స్విచాఫ్.. అనుమానమొచ్చి ఆరా తీయగా

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కి చెందిన వీళ్లిద్దరూ సోనమ్‌ - రాజా రఘువంశీ. ఈనెల 11 న పెళ్లి జరిగింది. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. వివాహ మహోత్సవం బంధు మిత్రుల ఈశీర్వాదం మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

Viral: జాలీగా హనీమూన్‌కు వెళ్లిన కొత్త జంట.. ఆపై ఫోన్లు స్విచాఫ్.. అనుమానమొచ్చి ఆరా తీయగా
Trending
Ravi Kiran
|

Updated on: May 29, 2025 | 7:15 AM

Share

పెళ్లి తంతు ముగిశాక.. హనీమూన్‌ వెళ్లాలని నిర్ణయించుకున్నారు నూతన దంపతులు. మే 20న ఇంటి నుంచి బయల్దేరారు. అసోం రాజధాని గౌహతి మీదుగా షిల్లాంగ్ వెళ్లారు. వెళ్లే దారిలో కామాఖ్యా అమ్మవారిని దర్శించుకున్నారు. షిల్లాంగ్‌కి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిరాపుంజిని సందర్శించడానికి యాక్టివాను అద్దెకు తీసుకున్నారు. దట్టమైన అడవిలో ప్రయాణిస్తూ ముందుకెళ్లారు. మరుసటి రోజు సోహ్రారిమ్‌ గ్రామ సమీపంలో యాక్టివా పడి ఉంది. కానీ దంపతులు మాత్రం కనిపించకుండా పోయారు. మేఘాలయాలోని ఈస్ట్ కాశీ హిల్స్‌ జిల్లాలో ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా రెండు జంటలు అదృశ్యమయ్యాయి. లేటెస్ట్‌గా సోనమ్ – రాజా కనిపించకుండాపోవడం మిస్టరీగా మారింది. తన బిడ్డతో మే 23న చివరిసారిగా మాట్లాడామన్నారు అన్నారు రాజా పేరెంట్స్‌. ఆ తర్వాత వాళ్ల నుంచి కమ్యూనికేషన్ లేకుండా పోయిందన్నారు. మే 24న వాళ్ల ఫోన్లు స్విచాఫ్‌ వచ్చాయన్నారు.

కంగారుపడ్డ బాధిత కుటుంబం మేఘాలయ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు, బంధువులతో కలిసి సోహ్రా ప్రాంతాలో గాలించింది. అక్కడి అడవులో చూడ్డానికి ఎంత అందంగా ఉంటాయో.. అంతే ప్రమాదకరంగా ఉంటాయన్నారు పోలీసులు. ఓస్రా హిల్‌లో ఆ జంట చివరి లొకేషన్‌ చూపించింది. అది చాలా ప్రమాదకరమైన ప్రాంతం అంటున్నారు. అక్కడ ఉండే  రిసార్ట్‌కు నేర చరిత్ర ఉందని.. దాని సిబ్బందిని విచారిస్తున్నామన్నారు. హనీమూన్ కోసం వెళ్లిన జంట ఆ రిసార్ట్‌లో సేద తీరారా లేదా అన్న కోణంలోనూ ఆరాతీస్తున్నారు. సోనన్- రాజా అద్దెకు తీసుకున్న యాక్టివా నంబర్‌ ఆధారంగా దాని ఓనర్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. హ్యాపీగా జాలీగా హనీమూన్ వెళ్లిన జంట అదృశ్యం వెనుక ఏం జరిగింది? నగలు, నగదు కోసం ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేదంటే స్కూటిపై వెళ్తూ కింద పడిపోయారా? మిస్సింగ్ మిస్టరీ సాధ్యమైనంత త్వరగా ఛేదిస్తామంటున్నారు ఇండోర్‌ పోలీసులు.

పెద్దలు సంతోషంగా సాగనంపారు. సోనమ్‌ – రాజా రఘువంశీ మే 20న షిల్లాంగ్ చేరుకున్నారు. ఏం జరిగిందో తెలియదు.. దంపతులకు ఎలాంటి ఆపద వచ్చిందో తెలియదు.. మరుసటి రోజును ఫోన్ స్విచాఫ్‌. వాళ్ల దగ్గర్నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది. గూగుల్‌ మ్యాప్ ఆధారంగా దంపతులకు స్కూటీ ఇచ్చిన వ్యక్తిని బంధువులు గుర్తించారు. తమ వాళ్లు ఎక్కడా అని ప్రశ్నించారు. తనకేం తెలియదని సమాధానం ఇవ్వడంతో బంధువులే పరిసర ప్రాంతాల్లో గాలించారు. స్కూటీ ఓ అనుమానాస్పద ప్రాంతంలో పడి ఉంది. కానీ దంపతుల ఆచూకీ మాత్రం తెలియరాలేదు. దీంతో షిల్లాంగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో ఇండోర్‌ పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చారు.

అదే స్పాట్‌లో గతంలో ఓ జంట మాయమైందట. ఈ విషయం తెలిసినప్పటి నుంచి సోనమ్ -రాజా రఘువంశీ కుటుంబాల్లో ఆందోళన మరింత పెరిగింది. కొడుకు, కోడలు ఎక్కడున్నారో తెలియక కన్నీరుమున్నీరవుతోంది రఘువంశీ కుటుంబం. ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ వాళ్ల ఆచూకీ చెప్పాలని వేడుకుంటున్నారు. హ్యాపీగా జాలీగా హనీమూన్ వెళ్లిన జంట అదృశ్యం వెనుక ఏం జరిగింది? నగలు, నగదు కోసం ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేదంటే స్కూటిపై వెళ్తూ కింద పడిపోయారా? అసలేం జరిగింది? మిస్సింగ్ మిస్టరీ సాధ్యమైనంత త్వరగా ఛేదిస్తామంటున్నారు ఇండోర్‌ పోలీసులు

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్