శవాలను సింగారించి సెల్ఫీలు దిగడం ఏంట్రా.. బాబు.! పైగా ఐశ్వర్యం వస్తుందట

|

Sep 18, 2024 | 5:07 PM

మృతదేహాలకు కొత్త దుస్తులు తొడిగి, వారికి ఉన్న అలవాట్ల ప్రకారం వాటిని అందిస్తారు.. అవసరమైతే సిగరెట్‌ లాంటివి కూడా అందిస్తారు. వారితో ఫోటోలు దిగుతుంటారు. వారినలా అలంకరించడం మాత్రమే కాదు, వారితో మాట్లాడుతున్నట్లుగా, ఆహారం తినిపిస్తున్నట్లుగా నటిస్తూ ఆనందపడతారు.

శవాలను సింగారించి సెల్ఫీలు దిగడం ఏంట్రా.. బాబు.! పైగా ఐశ్వర్యం వస్తుందట
Indonesian dead bodies rituals
Follow us on

ప్రపంచంలోని అనేక ప్రాంతాల ప్రజలు వివిధ సంప్రదాయాలను అనుసరిస్తారు. కానీ, ఇండోనేషియాలో ఉన్న దక్షిణ సులవేసిలోని టానా టోర్జా తెగ ప్రజలు ఒక వింత సంప్రదాయాన్ని అనుసరిస్తారు..! ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరుగని అరుదైన ఆచారాన్ని ఇండోనేషియాలోని టోర్జా తెగ వారు పాటిస్తారు. ఇండోనేషియాలోని దక్షిణ సులవేసిలోని ఎత్తైన ప్రాంతం టానా టోర్జా తెగ ప్రాంతం.. ఇక్కడి ప్రజలు అనుసరిస్తున్న వింత సంప్రదాయాల గురించి వింటే మీరు ఆశ్చర్యపోతారు. అంతే కాదు.. షాక్‌ అవుతారు కూడా. ఈ తెగ వారు చనిపోయిన తర్వాత తమ ప్రియమైన వారిని చాలా విచిత్రంగా గుర్తు చేసుకుంటారు. వారు తమ ప్రియమైన వారు చనిపోతే పాతిపెట్టరు. లేద కాల్చటం కూడా చేయరు.. మరేంచేస్తారంటే…

మీడియా కథనాల ప్రకారం.. టానా టోర్జా తెగ ప్రజల విచిత్రమైన ఆచారం ఏమిటంటే.. తమ బంధువులు, లేదా సొంత కుటుంబ సభ్యులు మరణిస్తే ఆ మృతదేహాన్ని పూడ్చిపెట్టడం గానీ, లేదా పూర్తిగా కాల్చడం గానీ చేయరు. సగం కాల్చి మృతదేహాలను ఇంటికి తీసుకుని వెళ్తారు. మృతదేహాలను సగం వరకు కాల్చిన తర్వాత, ఈ వ్యక్తులు దానిపై పంది కొవ్వును రాసి ఆ శవాలను మమ్మీలుగా చేసి ప్రత్యేక నిర్మాణంలో ఉంచుతారు. ఆ నిర్మాణంలోకి కొందరు మాత్రమే వెళ్తుంటారు. ఇలా భద్రపరిచిన మృతదేహాలకు ఏటా వేడుక నిర్వహిస్తారు. మృతదేహాలను అక్కడ నిర్మాణల్లోంచి బయటకు తీసి అలంకరించి పండగ జరుపుకుంటారు.

మా నెనె గా పిలిచే ఓ వింత ఆచారాన్ని టోర్జా తెగవారు కుటుంబ సభ్యులందరితో కలిపి జరుపుకుంటారు. ఇందులో భాగంగా ఏటా ఆగస్టు నెల చివర్లో జరిపే ఈ ఉత్సవంలో టోర్జా తెగ వారు మృతదేహాలకు కొత్త దుస్తులు తొడిగి, వారికి ఉన్న అలవాట్ల ప్రకారం వాటిని అందిస్తారు.. అవసరమైతే సిగరెట్‌ లాంటివి కూడా అందిస్తారు. వారితో ఫోటోలు దిగుతుంటారు. వారినలా అలంకరించడం మాత్రమే కాదు, వారితో మాట్లాడుతున్నట్లుగా, ఆహారం తినిపిస్తున్నట్లుగా నటిస్తూ ఆనందపడతారు.

ఇవి కూడా చదవండి

మరణించిన వ్యక్తి శరీరాన్ని కుళ్లిపోకుండా ఎంబామింగ్‌ చేస్తారు. ఎవరూ తాకకుండా ఏళ్ల తరబడి శరీరాన్ని భద్రపరుస్తారట. ఇక్కడ ప్రజల విశ్వాసం ప్రకారం.. ఎంత బాగా సంరక్షించబడిన శవం వారి కుటుంబీకుల్లో మంచి భవిష్యత్తును అందిస్తుంది. కాబట్టి మరణించిన వారిని ఉత్తమ స్థితిలో ఉండేలా ఆయా కుటుంబాలు చాలా కష్టపడతాయి. మృత దేహానికి స్నానం చేయించడం, వారితో మాట్లాడడం, వారి ఫొటోలు తీయడం, ఆహారం, పానీయాలు తయారు చేయడం, సిగరెట్‌లు తాగించటం వంటి కొన్ని ఆచారాలు కూడా పాటిస్తారు. అనేక జంతువులను కూడా బలి ఇస్తారు.

వేడుకలు ముగిసిన తర్వాత, చనిపోయిన వారి సమాధులను శుభ్రం చేసి అక్కడే పాతిపెడతారు. ఈ ఆచారాన్ని వారు ప్రతి సంవత్సరం పాటలు, నృత్యాలతో ఉత్సహంగా నిర్వహిస్తారు. ఇదొక్కటే కాదు, గేదె నుండి పందుల వరకు అనేక జంతువులను కూడా బలి ఇస్తారు. ఒక వ్యక్తి ఎంత ధనవంతుడైతే అంత ఎక్కువ జంతువులను వధిస్తారు. వందకు చేరే వరకు ఈ సంఖ్య పెరుగుతుంది. వధించిన తరువాత, ఆ జంతువుల మాంసాన్ని ఈ వేడుకకు వచ్చే ప్రజలకు తినిపిస్తారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..