Viral News: ఇతను నిజంగా సాహస వీరుడే.. ఈ షాకింగ్ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..!

|

Feb 11, 2022 | 7:47 PM

Viral News: ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఆరేళ్లు ఇబ్బంది పడింది ఆ మొసలి(Crocodile). కానీ, ఓ వ్యక్తి తన ప్రాణాలను పణంగా పెట్టి మరి.. ఆ మొసలికి మోక్షం కలిగించాడు.

Viral News: ఇతను నిజంగా సాహస వీరుడే.. ఈ షాకింగ్ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..!
Follow us on

Viral News: ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఆరేళ్లు ఇబ్బంది పడింది ఆ మొసలి(Crocodile). కానీ, ఓ వ్యక్తి తన ప్రాణాలను పణంగా పెట్టి మరి.. ఆ మొసలికి మోక్షం కలిగించాడు. ఇంతకీ మొసలికి కలిగిన ఇబ్బంది ఏంటి? ఆ వ్యక్తి ఏవిధంగా విముక్తి కలిగించాడో ఇప్పుడు తెలుసుకుందాం. వివరాల్లోకెళితే.. ఇండోనేషియా(Indonesia) సెంట్రల్‌ సులవేసిలోని ఉప్పునీటి సరస్సులో(Lake) ఓ మొసలి ఉంది. దురదృష్టం కొద్ది ఆ మొసలి మెడ ఓ టైర్‌ మధ్యలో ఇరుక్కుంది. రోజురోజుకు ఆ టైరు మొసలి మెడ నుంచి పొట్టమీదకు జారుతూ బిగుసుకుపోతోంది. దీంతో టైరు వల్ల ఇబ్బంది పడుతున్న మొసలి ప్రాణాలకు ప్రమాదం ఉందని గ్రహించారు అధికారులు. ఆ టైర్‌ను తీయడానికి భారీ ఆఫర్‌ను కూడా ప్రకటించారు. దీంతో చాలామంది ముందుకొచ్చినా, ఎలాంటి ఫలితం దక్కలేదు. ఇలా ఆరేళ్లు గడిచాయి. ఇక దాని టైం దగ్గరపడింది అనుకున్న సమయంలో.. ఓ వ్యక్తి హీరోలా వచ్చాడు. అతనే టిల్లీ. ఆ వ్యక్తి ఎంతో రిస్క్ చేసి ఎట్టకేలకు మొసలికి ఉపశమనం కలిగించాడు.

సులవేసి ద్వీపానికి చెందిన టిలీ అనే వ్యక్తి, మొసలి మెడకు చిక్కుకున్న టైరును తొలగించాడు. టిల్లీ కూడా మొసలిని పట్టుకునేందుకు చాలా కష్టపడ్డాడు. దానిని ట్రాప్ చేయడం కోసం కోళ్లు, బాతులతో ఎర వేశాడు. అయినా మొసలి చిక్కలేదు. ఇలా ఎన్నోసార్లు ప్రయత్నాలు చేయగా, చివరకు ఎలాగోలా మొసలిని బంధించాడు. దాని మెడకున్న టైరును తీశాడు. అనంతరం మొసలిని తిరిగి నదిలోకి విడిచిపెట్టారు అధికారులు. అయితే, ప్రభుత్వం నుంచి డబ్బు వస్తుందన్న ఆశతో తాను ఈ పని చేయలేదని చెబుతున్నాడు టిల్లీ. మొసలి అవస్థను చూడలేకే ఈ సాహసానికి సిద్ధమయ్యాయనని, అంటున్నాడు. తాను ఆ మొసలిని పట్టుకోవడానికి ఇతరులను సహాయం అడిగానని, కానీ మొసలిని చూసి వారు భయపడిపోయారాని చెప్పాడు. దాంతో తానొక్కడినే మొసలిని పట్టుకోవాలని నిశ్చయించుకున్నానని టిల్లీ పేర్కొన్నాడు. చివరకు తన స్నేహితుల సహాయంతో టైర్‌ను తొలగించి, తిరిగి నదిలోకి విడిచి పెట్టామని చెప్పాడు. మొసలికి విముక్తి కలిగించడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశాడు టిల్లీ. నిజంగానే టిల్లీ రియల్ హీరో కదా!

Also read:

AP News: ఏపీలో రక్తం మోడిన రహదారులు.. పలు ప్రమాదాల్లో ఆరుగురు మృతి, 15 మందికి గాయాలు..

NTA SWAYAM July 2021: స్వయం జూలై 2021 అడ్మిట్ కార్డులు విడుదల.. 300 ఆన్‌లైన్‌ కోర్సుల్లో..

Ranga Ranga Vaibhavanga: అఫీషియల్ ప్రకటన వచ్చేసింది.. వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా రిలీజ్ అయ్యేది అప్పుడే..