Viral News: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సృష్టించిన అద్భుతం.. భారత్‌లోని మహిళలకు దృశ్యరూపం.

ప్రస్తుతం కృత్రిమేథ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ప్రపంచాన్ని శాసిస్తోంది. మనిషి చేసే అన్ని రకాల పనులను కంప్యూటర్‌ చేసే రోజులు వచ్చేస్తున్నాయి. కారు నడపడం మొదలు వంటలు చేయడం వరకు, ఆపరేషన్స్‌ మొదలు చివరికి చిత్ర లేఖనం వరకూ అన్నింటినీ కంప్యూటర్లే చేసేస్తున్నాయి. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌...

Viral News: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సృష్టించిన అద్భుతం.. భారత్‌లోని మహిళలకు దృశ్యరూపం.
Viral News

Updated on: Dec 30, 2022 | 1:05 PM

ప్రస్తుతం కృత్రిమేథ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ప్రపంచాన్ని శాసిస్తోంది. మనిషి చేసే అన్ని రకాల పనులను కంప్యూటర్‌ చేసే రోజులు వచ్చేస్తున్నాయి. కారు నడపడం మొదలు వంటలు చేయడం వరకు, ఆపరేషన్స్‌ మొదలు చివరికి చిత్ర లేఖనం వరకూ అన్నింటినీ కంప్యూటర్లే చేసేస్తున్నాయి. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సహాయంతో రూపొందించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఢిల్లీకి చెందిన మాదవ్‌ కోహ్లీ అనే కళాకారుడు ఏఐ టెక్నాలజీ ఆధారంగా దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన పురుషుల చిత్రాలను గతంలో సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

ఇదిలా ఉంటే తాజాగా ఆయన మహిళల ఫొటోలను సైతం షేర్‌ చేశారు. స్టీరియోటిపికల్ అనే ఫీచర్‌ సహాయంతో దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన మహిళల ముఖ కవలికలను ఆధారంగా చేసుకొని వీటిని రూపొందించారు. ఢిల్లీ , ముంబై, గోవా, మహారాష్ట్ర, అస్సాం, కశ్మీర్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన మహిళల ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఈ ఫొటోలపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తుండగా మరికొందరు మాత్రం విమర్శలు కురిపిస్తున్నారు. ఓ నెటిజన్‌ స్పందిస్తూ గోవా రాష్ట్రానికి చెందిన మహిళ ఫొటోను అవమానంగా చీత్రకరించారు అంటూ స్పందిచంగా. మరో యూజర్‌.. ముంబైకి చెందిన మహిళ ఫొటో అచ్చంగా నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా షోలలో చూపించినట్లు ఉంది అంటూ కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..