భారతీయ రైల్వే నిత్యం ఎంతో మంది ప్రజలకు సౌకర్యవంతమైన రవాణాను అందజేస్తుంది. అయితే, రైళ్లలో టిక్కెట్లు లేకుండా ప్రయాణించే వారి సంఖ్య కూడా అంతగానే పెరుగుతుంది. ఈ విషయం రైల్వే యంత్రాంగంలో ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉండగా టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని టీటీఈ (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) పట్టుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సందర్బంగా టిక్కెట్టు లేని ప్రయాణికులు టీటీఈపై దాడి చేశారు. బలవంతంగా అతన్ని కోచ్ నుంచి బయటకు తోసేశారు.. అయితే నాటకీయ పరిణామాలన్నీ వాళ్లు ఊహించని మలుపు తిరిగాయి. టిక్కెట్లు లేకుండా ప్రయాణించిన వారు చేసిన పనికి ఫలితం అనుభవించాల్సి వచ్చింది.
వైరల్ వీడియోలో, టీటీఈని వెనుకకు నెట్టడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు యువకులు తలుపు వద్ద టీటీఈని కొట్టడం కనిపిస్తుంది. వీడియో రికార్డింగ్ చేస్తున్న వ్యక్తి టికెట్ లేని ప్రయాణికుల వద్దకు వెళ్లి టీటీఈతో దురుసుగా ప్రవర్తించినందుకు వారిని తిట్టాడు. టీటీఈ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నాడు. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి షాకిస్తూ ఊహించని విధంగా కంప్లైట్ ఫైల్ చేశాడు..
Kalesh b/w Two guys And TTe inside Train over Boarding an AC coach without tickets and then misbehaving with the TTE
pic.twitter.com/rE35f1BDQT— Ghar Ke Kalesh (@gharkekalesh) March 14, 2024
ఈ మేరకు టీటీఈ ముందుగా అక్కడికి వచ్చి ప్రయాణికులు సహకరించాలని అభ్యర్థించాను కానీ, వారు నిబంధనలు పాటించకుండా గొడవకు దిగారని చెప్పాడు. కోచ్ లోపల కొందరు అతన్ని అడ్డుకున్నారు. తలుపు మూసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టకేలకు తాను కోచ్‌లోకి ప్రవేశించి, తనను ఆపిన యువకులను టిక్కెట్ల కోసం అడుగుతాడు. అతను వారిద్దరిపై ఫిర్యాదు చేస్తాడు. దాంతో వెంటనే ఆ ఇద్దరు టీటీఈ వేడుకోవటం మొదలుపెట్టారు.
ప్రారంభంలో, ఈ వీడియో అరహంత్ షెల్బీ అనే X ఖాతాలో షేర్ చేయబడింది. అనంతరం ఇది ప్రముఖ పేజీ ఘర్ కా కాలేష్ ద్వారా మళ్లీ పోస్ట్ చేయబడింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఒకరు ఇలా వ్రాశారు, టిక్కెట్ లేదు…ఇంకా కొట్టడం, అంత ధైర్యం ఎక్కడ నుండి వస్తుందని ప్రశ్నించారు. ఇలా చాలా మంది నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..