
అందాల కాశ్మీరం.. కన్నీటి సంద్రమైంది. కిష్వార్‌లోని చండీ మాతా మచైల్ యాత్రకు వెళ్లిన భక్తులు ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయారు. ఒక్కసారిగా కురిసిన కుండపోతతో.. అక్కడి కొండల నుంచి పెద్ద పెద్ద బండరాలు.. భక్తులు బసచేస్తున్న గుడారాలు, క్యాంపులపై పడ్డాయి. అంతేకాదు.. వరద పోటుకి చాలామంది లోయల్లో కొట్టుకుపోయారు.
అసలు కిష్త్వార్‌లో ఇంతగనం వర్షం పడే అవకాశం లేదు. కాని ఏడాది అంతటిలో కురవాల్సిన వర్షం.. నిన్న ఒక్కరోలే.. ఒక్క గంటలో కురిసింది. దీంతో కొండలపై నుంచి వరద తన్నుకొచ్చింది. అక్కడున్న రాళ్లు రప్పలు, చెట్లు చెదారం అంతా కిందకు జారింది. జనం హాహాకారాలు పెడుతూ పరుగులు తీసినా లాభం లేకుండా పోయింది. ఆ వరదలు వందల మంది కొట్టుకుపోయారు. బండరాళ్లు మీదపడి చాలామంది చిక్కుకుపోయారు. బయటకు తీస్తుంటే శవాలు బయటపడుతున్నాయి కాని.. ఎవరూ సజీవంగా రావడంలేదు.
సడన్ క్లౌడ్ బరస్ట్ మాతా మచైల్‌యాత్రలో విషాదాన్నే నింపింది. శిథిలాల కింద 500మందికి పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పదుల సంఖ్యలో మృతులు బయటపడుతుండం.. అటు ఆప్తులు తమ వారి శవాలను చూసి గుండెలవిసేలా రోదించడం కిష్త్వార్‌లో కనిపిస్తున్న దృశ్యాలు. అటు ఆస్పత్రుల్లో చాలామంది క్షతగాత్రులు ప్రాణాలతో పోరాడుతున్నపారు. అక్కడి దృశ్యాలు భీతావాహంగా ఉన్నాయి.
#WATCH | J&K | Personnel of the Indian Army, J&K Police, and NDRF, help rescue people stuck in the Chashoti area of Kishtwar, where a flash flood occurred following a cloudburst on 14th August. pic.twitter.com/hOvjKbmWEt
— ANI (@ANI) August 15, 2025
ప్రస్తుతం కిష్త్వార్‌లో NDRF, SDRF, CISF, CRPF, జమ్ముకశ్మీర్ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంటున్నారు. అటు స్థానికులు కూడా వీరికి సాయం చేస్తున్నారు. జాగిలాలతో తనిఖీలు జరుపతున్నారు. అయితే మృతుల్లో భక్తులే కాకుండా.. స్థానికులు, సీఐఎస్‌ఎఫ్ అధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. జమ్ముకశ్మీర్ సీఎం రెస్క్యూ ఆపరేషన్స్‌ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఉదయం శ్రీనగర్‌లో జెండా వందనంలో పాల్గొన్న ఒమర్ అబ్దుల్లా తర్వాత కిష్త్వార్‌కు బయల్దేరి వెళ్లారు. అటు ప్రధాని కూడా దీనిపై ఎప్పటికపుడు ఆరాతీస్తున్నారు.