రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు.. ఏ క్షణంలోనైనా పేలేందుకు సిద్ధం..! ఎక్కడంటే..

రెండవ ప్రపంచ యుద్ధం మచ్చలు నేటికీ ఉన్నాయి. గత సంవత్సరం అస్సాంలో రెండవ ప్రపంచ యుద్ధం నాటి బాంబును స్వాధీనం చేసుకున్నారు. అది ఒక క్రియాశీల బాంబు, దర్యాప్తులో అది రెండవ ప్రపంచ యుద్ధం నాటిదని నిర్ధారించారు. అది ఆ సమయంలో పేలలేదు. ఇప్పుడు ఈ బాంబు నిష్క్రియం చేశారు. దీనికోసం దాదాపు మూడున్నర కిలోమీటర్ల దూరం మొత్తం ప్రజలు, ఇతర జంతుజీవాలు ఏవి  లేకుండా జాగ్రత్తపడ్డారు. 

రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు.. ఏ క్షణంలోనైనా పేలేందుకు సిద్ధం..! ఎక్కడంటే..
World War Ii Era Bomb

Updated on: Feb 16, 2025 | 12:51 PM

గత సంవత్సరం అస్సాంలోని లఖింపూర్ జిల్లాలో రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి 182 కిలోల బాంబును నిర్వీర్యం చేశారు. 2024లో అస్సాంలోని లఖింపూర్ జిల్లాలో లభించిన 182 కిలోల రెండవ ప్రపంచ యుద్ధం నాటి బాంబును ఫిబ్రవరి 13న నిర్వీర్యం చేశారు. ఈ బాంబును 2024 సెప్టెంబర్ 27న జిలి నది ఒడ్డున వైమానిక దళం కనుగొన్నట్లు లఖింపూర్ జిల్లా కమిషనర్ ప్రణబ్ జీత్ కకోటి తెలిపారు. అది దొరికినప్పుడు అది యాక్టివ్ బాంబుగా గుర్తించారు. అంటే, అది ఏ క్షణంలోనే పేలిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. దాంతో ఈ బాంబును డులుంగ్ రిజర్వ్ ఫారెస్ట్ లోపల వైమానిక దళ నిపుణులు నిర్వీర్యం చేశారు. బాంబును నిర్వీర్యం చేసే ముందు వన్యప్రాణులను రక్షించడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని దులుంగ్ రిజర్వ్ ఫారెస్ట్ అధికారి మనోజ్ కుమార్ గోస్వామి తెలిపారు. బాంబును నిర్వీర్యం చేసిన ప్రదేశం చుట్టూ దాదాపు 3.5 కిలోమీటర్ల ప్రాంతాన్ని ముందుగానే క్లియర్ చేశామని చెప్పారు. అనంతరం ఆ బాంబును విజయవంతంగా నిర్వీర్యం చేశారు.

అంతకుముందు, గత ఏడాది జూన్ 29న పశ్చిమ బెంగాల్‌లోని ఝర్‌గ్రామ్ జిల్లాలోని భూలాన్‌పూర్ గ్రామంలో కూడా ఒక బాంబు కనుగొన్నారు.. ఈ బాంబు కూడా రెండవ ప్రపంచ యుద్ధం కాలం నాటిదని చెప్పబడింది. దీని తరువాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా భారత వైమానిక దళాన్ని సంప్రదించి బాంబును నిర్వీర్యం చేసింది. భద్రతా చర్యగా, పేలుడుకు ముందే ఆ ప్రాంతంలోని అన్ని ఇళ్లను ఖాళీ చేయించారు.

రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబులు దొరకడం ఇదే మొదటిసారి కాదని సంబంధిత అధికారులు అన్నారు. 1990లలో కూడా కొన్ని బాంబులు దొరికాయి. మణిపూర్‌లోని ఇంఫాల్‌లో మోరే వద్ద విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కోసం తవ్వకం సమయంలో 87 బాంబు గుండ్లు బయటపడ్డాయి. ఈ బాంబులన్నీ రెండవ ప్రపంచ యుద్ధం కాలం నాటివని అప్పుడు చెప్పుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..