
భారతదేశంలోని ముఖ్యమైన నాయకుల భద్రతా వ్యవస్థ బహుముఖంగా ఉంటుంది. దేశంలోని నిఘా సంస్థల నివేదికలు, ఆ వ్యక్తి ఉన్న ముప్పుస్థాయి ఆధారంగా ఆ నాయకులకు భద్రతా వర్గాలు కేటాయిస్తారు. అదేవిధంగా, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, ఇతర ముఖ్యమైన నాయకులకు వేర్వేరు భద్రతా దళాలను కేటాయిస్తారు. ఈ వ్యవస్థ కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయంతో పనిచేస్తుంది.
భారత ప్రధానమంత్రి భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారు?
భారత ప్రధాని భద్రత బాధ్యత మొత్తం ప్రత్యేకంగా శిక్షణ పొందిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌పై ఉంటుంది. దేశంలో ప్రత్యేక శిక్షణ పొందిన ప్రొటెక్షన్ ఫోర్స్‌లో SPG దేశంలోనే టాప్‌లో ఉంటుంది. అందుకే వీరే ప్రధానికి సెక్యూరిటీగా ఉంటారు. ప్రధాని ఎక్కడికి వెళ్లినా సంబంధిత రాష్ట్ర పోలీసు దళాలతో పాటు SPG కూడా భద్రతా ఏర్పాట్లలో పాల్గొంటుంది.
నాలుగు అంచెల భద్రతా జోన్
ప్రధానమంత్రి చూట్టూ భద్రత ఎప్పుడూ నాలుగు అంచెలుగా విభజించబడి ఉంటుంది. మొదటి స్టేజ్‌లో SPG అంగరక్షకులు ప్రధాన మంత్రికి అత్యంత సమీపంలో పనిచేస్తారు. రెండవ స్టేజ్‌లో SPG కమాండోలు ఉంటారు. వీరు ప్రధాని కూర్చునే వేదిక, పరిసర ప్రాంతాలను పూర్తిగా కవర్ చేస్తారు. మూడవ స్టేజ్‌లో సాధారణంగా బ్లాక్ క్యాట్ కమాండోలు ఉంటారు. వీరు అత్యవసర పరిస్థితుల్లో మోహరిస్తారు. ఇక పోర్త్ స్టేజ్‌లో పారామిలిటరీ దళాలు, స్థానిక పోలీసులు భద్రతా ఉంటుంది. వీరంతా అనుక్షణం పరిసర ప్రాంతాలను డేగ కళ్లతో పరీక్షిస్తూ ఉంటారు. అచితే గతంలో మాజీ ప్రధానులు, వారి కుటుంబ సభ్యులకు కూడా SPG భద్రత కల్పించారు. కానీ చట్టంలో కొత్త సవరణ తర్వాత, ఈ ఉన్నత స్థాయి భద్రత అనేది కేవలం ప్రధానమంత్రికి మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించబడింది.
బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు
ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడికి వెళ్లిన ఆయన బుల్లెట్ ప్రూఫ్ కారులోనే వెళ్తారు. ఎందుకంటే ఆయన కాన్వాయ్‌లో ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలు, ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు, నిఘా పరికరాలు ఉంటాయి. అందువల్ల, ఒక సాధారణ పర్యటనలో, దాదాపు వంద మంది భద్రతా సిబ్బంది పాల్గొంటారు.
మోదీ తర్వాత అత్యున్న భద్రత కలిగిన నాయకుడు
ఇక దేశ ప్రధాని తర్వాత అత్యున్నత భద్రత కలిగిన నాయకుడు ఎవరనే విషయానికి వస్తే ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆయనకు Z+ కేటగిరీ భద్రత కల్పించారు. ఈ వ్యవస్థలో దాదాపు 55 మంది భద్రతా సిబ్బంది, NSG కమాండోలు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఇరవై నాలుగు గంటల రక్షణ ఉన్నాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.