
India Most Unique Unakoti Temple: భారతదేశం దేవుళ్లు, ఆలయాలకు ప్రసిద్ధి. దేశవ్యాప్తంగా ఎన్నో మర్మమైన ప్రదేశాలు, గుళ్లూ చాలా ఉన్నాయి. అంతేకాదు.. పురాతన గుడులన్నీ అద్భుతమైన చరిత్ర, శిల్పకళలకు నెలవు. వాటి రహస్యాలు ఇప్పటికి ఎవరికి తెలియదు. అలాంటి ఒక ఆలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. భారతదేశంలో చాలా రహస్యమైన, అంతుబట్టని వింతలు కలిగిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి, వాటి రహస్యాలు ఇప్పటివరకు బయటపడలేదు. ఈ ఆలయం వాటిలో ఒకటి. మొత్తం 99 లక్షల 99 వేల 999 విగ్రహాలు కలిగిన ఈ ఆలయం ఇప్పటికీ అంతుచిక్కని మిస్టీరియస్ టెంపుల్‌గా ప్రజలను ఆకర్షిస్తుంది. ఈ ఆలయ రహస్యాన్ని ఛేదించడానికి చాలా మంది పండితులు ప్రయత్నించారు. కానీ, వారి ప్రయత్నలేవీ ఫలించలేదు.
ఈ ఆలయంలోని విగ్రహాల గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకప్పుడు శివుడు కోటి మంది దేవుళ్ళు, దేవతలతో కలిసి ఎక్కడికో వెళ్తుండగా మార్గమధ్యలోనే చీకటి పడింది. రాత్రి సమయంలో దేవతలంతా ఒక చోట ఆగి విశ్రాంతి తీసుకున్నారట. అలా దేవతలందరూ నిద్రలోకి జారుకున్నారు. శివుడు ఉదయాన్నే నిద్ర లేచి చూస్తే.. దేవతలందరూ ఇంకా నిద్రలోనే ఉన్నారు. దాంతో ఆయనకు కోపం వచ్చిందట. కోపంలో నిద్రపోతున్న దేవతలందరూ శిలలుగా మారాలని శపించాడని నమ్ముతారు.
ఈ విగ్రహాల గురించి మరొక కథ ప్రాచుర్యంలో ఉంది. అప్పట్లో కలు అనే హస్తకళాకారుడు ఉండేవాడని, అతను శివపార్వతులతో కలిసి కైలాస పర్వతానికి వెళ్లాలని అనుకున్నాడు. కానీ, అది అసాధ్యం. హస్తకళాకారుడి పట్టుదల కారణంగా శివుడు అతనికి కలలో కనిపించి.. ఒక రాత్రిలో 1 కోటి దేవతల విగ్రహాలను తయారు చేస్తే, తనను తనతో తీసుకెళ్తానని చెప్పాడట.. ఆ తర్వాత, హస్తకళాకారుడు రాత్రంతా విగ్రహాలను తయారు చేశాడు.
అయితే, మొదటి కథలో ఒక దేవుడు శివుని శాపం నుండి తప్పించుకున్నాడని చెబుతారు. రెండవ కథలో రాత్రంతా ఒక కోటి విగ్రహాలను తయారు చేస్తుండగా, అందులో ఒక విగ్రహాన్ని ఆ కళాకారుడు పోగొట్టుకున్నాడని చెబుతారు.
ఒక కోటి కంటే ఒక్కటి మాత్రమే తక్కువ ఉండటం వల్ల దీనిని ఉనకోటి అని పిలుస్తారు. ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర దగ్గరలో ఉంది ఈ ఉనకోటి ఆలయం. త్రిపుర రాజధాని అగర్తలా నుండి 145 కి.మీ దూరంలో ఉంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..