Independence Day 2024: సముద్రంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ చేసిన అద్భుత దృశ్యం..చూసి తీరాల్సిన వీడియో!

|

Aug 14, 2024 | 8:05 PM

దీనికి క్యాప్షన్‌గా 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత తీర రక్షక దళం లక్షద్వీప్‌లోని స్పష్టమైన జలాల క్రింది భాగంలో జాతీయ జెండాను ఎగురవేసింది. హరఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ఉత్తేజకరమైన దృశ్యం సోషల్ మీడియాలో మరింత హల్‌చల్‌ చేస్తోంది.

Independence Day 2024: సముద్రంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ చేసిన అద్భుత దృశ్యం..చూసి తీరాల్సిన వీడియో!
Independence Day 2024
Follow us on

భారతదేశం 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆగస్టు 15, గురువారం జరుపుకోవడానికి సిద్ధంగా ఉంది. త్రివర్ణ పతాకం వెలుగులు విరజిమ్ముతూ ప్రతిచోటా దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకునేందుకు, స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుంటూ, దేశం కోసం వారు చేసిన త్యాగాలను స్మరించుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేలా ప్రజలను ప్రోత్సహించేందుకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారాన్ని నిర్వహిస్తుంది కేంద్రప్రభుత్వం.

ఇదిలా ఉండగా, స్వాతంత్ర్య దినోత్సవాన్ని గుర్తుండిపోయేలా చేయడానికి, భారత తీర రక్షక దళం కూడా లక్షద్వీప్‌లో ప్రత్యేక పద్ధతిలో సముద్రం కింద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. ఈ ఆసక్తికర వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ దృశ్యాన్ని ఇండియన్ కోస్టల్ గార్డ్ తన అధికారిక X ఖాతాలో షేర్‌ చేసింది. దీనికి క్యాప్షన్‌గా 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత తీర రక్షక దళం లక్షద్వీప్‌లోని స్పష్టమైన జలాల క్రింది భాగంలో జాతీయ జెండాను ఎగురవేసింది. హరఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ఉత్తేజకరమైన దృశ్యం సోషల్ మీడియాలో మరింత హల్‌చల్‌ చేస్తోంది.

ఆగస్టు 13న షేర్ చేయబడిన ఈ వీడియో 13,000 మందికి పైగా వీక్షించారు. అనేక మంది వీడియోపై స్పందించారు. కామెంట్ల రూపంలో ప్రజలు తమ దేశభక్తిని చాటుకుంటున్నారు. ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఇంకా చాలా మంది ‘జై హింద్ జై భారత్’ అని కామెంట్ రాశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..