Bengaluru: పేటీఎం తరహాలో పేసీఎం.. ముఖ్యమంత్రి ఫొటోలతో స్కానర్ బోర్డులు.. కలకలం సృష్టించిన పోస్టర్లు

|

Sep 21, 2022 | 5:30 PM

కర్ణాటక రాజధాని బెంగళూరులో (Bengaluru) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఫోటోతో కూడిన "PayCM" పోస్టర్లు నగరంలోని పలు ప్రాంతాల్లో కనిపించాయి. అవి విరివిగా ఉపయోగించే డిజిటల్..

Bengaluru: పేటీఎం తరహాలో పేసీఎం.. ముఖ్యమంత్రి ఫొటోలతో స్కానర్ బోర్డులు.. కలకలం సృష్టించిన పోస్టర్లు
Basavaraj Bommai
Follow us on

కర్ణాటక రాజధాని బెంగళూరులో (Bengaluru) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఫోటోతో కూడిన “PayCM” పోస్టర్లు నగరంలోని పలు ప్రాంతాల్లో కనిపించాయి. అవి విరివిగా ఉపయోగించే డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎం ను పోలి ఉన్నాయి. “40 % ఇక్కడ అంగీకరించబడింది” అని ఈ పోస్టర్లపై క్యాప్షన్స్ ఇచ్చారు. QR కోడ్ మధ్యలో బొమ్మై చిత్రపటం ఉంది. పబ్లిక్ కాంట్రాక్టులు, ప్రభుత్వ నియామకాల్లో అవినీతికి పాల్పడినట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. సీఎం బసవరాజు బొమ్మై (Basavaraj Bommai) అవినీతిని ఎండగడుతూ రాష్ట్ర రాజధాని బెంగళూరులో పోస్టర్లు అంటించి నిరసన తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సమయంలో ఈ పోస్టర్లు వెలవడం కలకలం రేపింది. పబ్లిక్ వర్క్స్ కాంట్రాక్టులు పొందడానికి కాంట్రాక్టర్లు 40 శాతం కమీషన్ చెల్లించాలని కాంట్రాక్టర్ల సంఘం ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీనిని ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చిన వెంటనే బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ఈ పోస్టర్లను తొలగించారు. ఈ ఘటనపై స్పందించిన అధికార బీజేపీ.. ఇది కాంగ్రెస్ హస్తమేనని ఆరోపించింది.

ఇది కాంగ్రెస్ చేసిన పనే. ఇందులో సందేహానికి ఆస్కారం లేదని అధికారపక్ష నేతలు ఖండించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, విచారణకు ఆదేశించారు. ఈ చర్య వెనుక ఎవరున్నారో బయటపెట్టాలని బీజేపీ రాష్ట్ర వర్గం సీఎంకు విజ్ఞప్తి చేసింది. అవినీతికి పాల్పడినట్లు రుజువు ఉంటే సమర్పించాలని, లేకుంటే ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని ఖాస్లే సవాల్ విసిరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..