Andhra Pradesh: ఇలాంటి రేస్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే..!

|

Apr 23, 2022 | 9:40 AM

Andhra Pradesh: గంగిగోవు పాలు గరిటెడైన సాలు, కడివెడైనానేమి ఖరము పాలు.. అని గాడిద పాలను, గాడిదలను చీపుగ చూస్తుంటాం.

Andhra Pradesh: ఇలాంటి రేస్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే..!
Donkey
Follow us on

Andhra Pradesh: గంగిగోవు పాలు గరిటెడైన సాలు, కడివెడైనానేమి ఖరము పాలు.. అని గాడిద పాలను, గాడిదలను చీపుగ చూస్తుంటాం. కానీ గాడిద పాలు చీపు కాదు, గాడిదలు ఇంకా చీపుకాదు. ఎందుకంటున్నమంటే.. ఈ వార్త చూస్తే తెలుస్తుంది.

మనం గుర్రం పోటీలను చూశాం.. ఒంటెల పోటీలను చూశాం.. మనుషుల పరుగుల పోటీలను చూశాం కానీ.. మరి గాడిదల పోటీని ఎప్పుడైనా చూశరా? అయితే ఇప్పుడు చూసేయండి. గుర్రాలను తలదన్నేలా… గుర్రాలకు తామేమీ తీసిపోమంటు తగ్గేదెలే అంటూ పరుగులు తీస్తున్న వినూత్న గాడిదల పరుగు పోటీని అనంతపురం జిల్లా వజ్రకరూ‌లో నిర్వహించారు. వజ్రకరూర్‌లో వెలసిన శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా ఈ పరుగు పోటీలను ఏర్పాటు చేశారు. ఈ గాడిదల పరుగు పోటీలను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి జనం తండోపతండాలుగా తరలి వచ్చారు. ఈ పోటీలను క్రీడామైదానంలో కాకుండా వజ్రకరూరు నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరం వెళ్లి తిరిగి వజ్రకరూరుకు వచ్చే విధంగా మొత్తం 18 కిలోమీటర్ల గాడిదల స్వారీ రేస్ నిర్వహించారు. ఇందులో నాలుగు గాడిదల రైడర్స్ పాల్గొనగా చివరికి రేసులో మూడు మాత్రమే మిగిలాయి.

ఆద్యంతం ఆసక్తికరంగా పోటాపోటీగా సాగిన ఈ పరుగుపందెం కూర్చుని చూడటానికి వీలు లేదు కాబట్టి యువకులందరూ బైక్ పై గాడిదల వెంట పరుగులు పెట్టారు.. ఈ పోటీ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పోటీలను నిర్వహిస్తున్నామని కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలు నిర్వహించలేక పోయామన్నారు. పరుగు పందెంలో విజయం సాధించిన వారికి నగదు బహుమతి అందజేసి శాలువా కప్పి సత్కరించారు.

Also read:

AP News: ‘ఏ బావ కళ్లల్లో ఆనందం కోసం చేశారు’.. ఎవరినీ వదిలిపెట్టను.. ఏబీవీ సీరియస్ వార్నింగ్..

Amit Shah Gun: టార్గెట్‌ ఫిక్స్‌ చేసిన షా.. మెషీన్ గన్ పట్టుకుని రచ్చ చేసేశారు..!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోనూ బుల్‌డోజర్ కలకలం.. ఏకంగా అధికారిపైనే..