Real Dog vs Robotic Dog : రోబోట్‌ డాగ్‌ని చూసిన రియల్‌ డాగ్‌.. ఏం చేసిందో తెలిస్తే అవాక్కే..! వీడియో వైరల్‌

|

Mar 21, 2024 | 7:44 PM

ఐఐటీ కాన్పూర్‌లోని లాన్‌లో ఈ వీడియో రికార్డైంది. రోబోటిక్ కుక్కకు నిజమైన కుక్కల వలె నాలుగు కాళ్ళు ఉన్నాయి. ఇది కూడా నిజమైన కుక్కల వలె నడుస్తుంది. వీడియోలో, రోబోటిక్ కుక్క కూడా మామూలు కుక్కలా నేలపై పడుకుని ఉంది. ఈ వీడియోను నాలుగు లక్షల మందికి పైగా వీక్షించగా, 16 వేల మందికి పైగా లైక్ చేశారు.

Real Dog vs Robotic Dog : రోబోట్‌ డాగ్‌ని చూసిన రియల్‌ డాగ్‌.. ఏం చేసిందో తెలిస్తే అవాక్కే..! వీడియో వైరల్‌
Real Dog Vs Robotic Dog
Follow us on

ఇప్పుడు చాలా పనులు రోబోల ద్వారానే జరుగుతున్నాయి. రెస్టారెంట్లలో ఫుడ్‌ సప్లై చేయటం, వాష్‌ చేయడం వంటి పనులు కూడా రోబోలు ఈజీగా చేసేస్తున్నాయి. వైద్య రంగంలో కూడా రోబోలు ఉపయోగించబడుతున్నాయి. ఈ క్రమంలోనే ఐఐటీ కాన్పూర్ విద్యార్థులు రోబోటిక్ డాగ్‌ను రూపొందించారు. రోబోటిక్ కుక్క నిజమైన కుక్కలను కలవడంతో ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే ఆశ్చర్యపోతారు. రోబోటిక్ కుక్కను చూసిన నిజమైన కుక్కలు షాక్‌కు గురయ్యాయి. రోబోటిక్ కుక్కను చూడగానే నిజమైన కుక్కల స్పందన ఎలా ఉందో మీరు వీడియోలో చూడవచ్చు..! ఈ వీడియోపై నెటిజన్ల నుండి ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి.

వినూత్నమైన రోబోట్ డాగ్‌లను తయారు చేసే మక్స్ రోబోటిక్స్ కంపెనీ సీఈఓ డాక్టర్ ముఖేష్ బంగర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వైరల్‌ వీడియోలో రోబోటిక్ కుక్కను చూసి నిజమైన కుక్కలు కోపంతో ఊగిపోయాయి. స్ట్రీట్‌ డాగ్స్‌ రోబోటిక్ కుక్కను చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాయి. రోబో డాగ్‌ చర్యలకు ముందుగా భయపడుతున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఐఐటీ కాన్పూర్‌లోని లాన్‌లో ఈ వీడియో రికార్డైంది. రోబోటిక్ కుక్కకు నిజమైన కుక్కల వలె నాలుగు కాళ్ళు ఉన్నాయి. ఇది కూడా నిజమైన కుక్కల వలె నడుస్తుంది. వీడియోలో, రోబోటిక్ కుక్క కూడా మామూలు కుక్కలా నేలపై పడుకుని ఉంది. ఈ వీడియోను నాలుగు లక్షల మందికి పైగా వీక్షించగా, 16 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై పలువురి నుంచి కామెంట్స్ వస్తున్నాయి. ఈ రోబోటిక్ కుక్క తల ఎక్కడుందో తెలియక అసలు కుక్కలు ఆశ్చర్యపోతున్నాయని ఒకరు రాశారు. సైన్స్ అంశాలు వాస్తవికతగా మారినప్పుడు అంటూ ఒకరు రాశారు.

అసలు కుక్క ఇంత దగ్గరికి వచ్చినా ఆ రోబో డాగ్‌ ఎందుకు మొరుగడం లేదని, తోక ఎక్కడికి పోయిందో అని బాధపడుతోందని మరొకరు రాశారు. అసలు కుక్క, ఫేక్‌ని చూసి ఇప్పుడు తన ఉద్యోగం కూడా పోయిందేమోనని అనుకుంటోందని ఒకరు రాశారు. నిజమైన కుక్కలు తమ భవిష్యత్తును అంధకారంలో చూసి ఆందోళన చెందుతున్నాయని ఇంకొకరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..