Robot: రోబోలు సినిమా కథలు రాసే రోజులు వచ్చేస్తున్నాయి.. సరికొత్త ఆవిష్కరణకు కుదిరిన డీల్‌..

|

Aug 04, 2022 | 4:07 PM

Artificial Intelligence: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. ఒకప్పుడు ఎంతో కష్టం అనుకున్న పనులు కూడా ఇప్పుడు చాలా సులువై పోయాయి...

Robot: రోబోలు సినిమా కథలు రాసే రోజులు వచ్చేస్తున్నాయి.. సరికొత్త ఆవిష్కరణకు కుదిరిన డీల్‌..
Follow us on

Artificial Intelligence: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. ఒకప్పుడు ఎంతో కష్టం అనుకున్న పనులు కూడా ఇప్పుడు చాలా సులువై పోయాయి. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వారకు మన అవసరాలు ఏంటి.? మనకు ఏం కావాలి.? ఇలా అన్ని రకాల విషయాలను అంచనా వేసి యూజర్లకు కావాల్సిన సమాచారాన్ని గ్యాడ్జెట్లు అందిస్తున్నాయి. ప్రస్తుతం అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగం అనివార్యంగా మారింది. ప్రస్తుతం మన కమాండ్స్‌కు స్పందించిన ఏఐ టెక్నాలజీ భవిష్యత్తులో మనకే సూచనలు చేసే స్థాయికి వెళ్లనున్నాయి. దీనికి మరెంత కాలం పట్టేలా కనిపించడం లేదు.

ఈ దిశగా మరో కీలక అడుగుపడింది. ఏఐ ఆధారిత ఆటోమేటిక్‌ స్క్రిప్ట్‌ రైటింగ్‌ టూల్‌ తయారీ కోసం ఈరోస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో ఐఐటీ బాంబే చేతులు కలిపింది. ఈ టూల్‌కు జపాన్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు కుసోవా పేరును ఖాయం చేశారు. హై ఎండ్‌ టెక్నాలజీతో రూపొందిస్తున్న ఈ టూల్ వినోద రంగానికి ఎంతగానో ఉపయోగపడుతుందని, సినిమా స్క్రిప్ట్‌ అభివృద్ధిలో ఫిల్మ్‌ మేకర్‌లకు ఈ టూల్‌ సహాయపడుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
అయితే ఎంతటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అయినా మనిషిలా ఆలోచించలేదుగా అని సందేహం వస్తుండొచ్చు.

ఈ టూల్ ఎలా పని చేస్తుంది.?

ఇంతకీ ఈ టూల్ ఎలా పనిచేస్తుందంటే.. ముందుగా కంప్యూటర్‌కు కథకు సంబంధించిన కొన్ని కీ పాయింట్స్‌ అందిస్తారు. ఆ డేటాను ఆధారంగా చేసుకొని ఏఐ టూల్‌ కథను ఎంచుకోవడం, సన్నివేశాలు ఎలా ఉంటే బాగుంటుంది లాంటి విషయాలను ఫిల్మ్‌ మేకర్స్‌కు సూచిస్తుంది. ఈ విషయమై ఈరోస్‌ ఇన్వెస్ట్‌ మెంట్స్‌ డైరెక్టర్‌ నవనీత్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘కుర‌సోవా టూల్ వినోద రంగంలో స‌రికొత్త విప్లవ’మని అభివర్ణించారు. ఇక ఐఐటీ బాంబే రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ డీన్‌ ప్రొఫెసర్‌ మిలింద్‌ అట్రీ స్పందిస్తూ.. ‘ఈ టూల్‌.. స్ర్కిప్ట్‌రైట‌ర్ల కోసం గ్రౌండ్‌వ‌ర్క్ చేయ‌డంతో పాటు సృజ‌నాత్మక‌త‌, నాణ్యత‌పై వారు మ‌రింత దృష్టిసారించడానికి సహాయపడుతుంది. కథను మరింత మెరుగైన సామర్థ్యంతో చెప్పేందుకు క్రియేటర్లకు ఉపయోగపడుతుంది’అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..