
రోమ్‌లో పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు హాజరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పోప్ ఎంపికపై ఒక ఫన్నీ కామెంట్ చేశారు. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ట్రంప్ తాను తదుపరి పోప్ కావాలని కోరుకుంటున్నాను అంటూ చమత్కరించారు. ట్రంప్ వాటికన్ నగరానికి తదుపరి నాయకుడు ఎవరు కావాలని మీరు అనుకుంటున్నారంటూ విలేఖరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఇలా చమత్కారం సమాదానం ఇచ్చారు.. “నేను పోప్ కావాలనుకుంటున్నాను. అదే నా నంబర్ వన్ చాయిస్ అంటూ జోక్ చేశారు. అలాగే, పోప్ ఫ్రాన్సిస్ వారసుడు ఎవరు కావాలనే దానిపై తనకు ఎలాంటి అవగాహన, అభ్యంతరం లేదన్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
😆”I’d like to be Pope.” – President Trump pic.twitter.com/WZavhJrKIa
— Breaking911 (@Breaking911) April 29, 2025
ఇకపోతే, కొత్త పోప్ ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. మే 7న వాటికన్ సిటీలోని సిస్టిన్ చాపెల్‌లో రహస్య ఓటింగ్ జరగనుంది. ఈ ప్రక్రియలో సుమారు 135 దేశాల నుంచి వచ్చిన కార్డినల్స్ పాల్గొంటారు. 12 ఏళ్ల పాటు కేథలిక్కుల మత పెద్దగా కొనసాగిన పోప్ ఫ్రాన్సిస్ ఈ నెల 21న మృతి చెందడంతో కొత్త పోప్ ఎన్నిక అవసరమైంది. ప్రపంచ దృష్టి ఇప్పుడు ఈ కీలక ఎన్నికపై నిలిచింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..