Viral Video: సముద్రంలో తిరగబడ్డ మంచుఫలకం… కాస్తయితే వారి పరిస్థితి ఏమయ్యేదో!

సముద్రాలు అంటేనే ప్రమాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెల్వదు. భారీ అలలు, తిమింగలాలు, తుఫాన్‌లు ఇలా అనేక ప్రమాదాలు సముద్రాల్లో తలెత్తుతుంటాయి. అందుకే వాతావరణ నిపుణులు ఎప్పటికప్పుడు మత్స్యకారులను, పర్యాటకులను అలర్ట్‌ చేస్తుంటారు. ఇక కొంతమంది టూరిస్టులు ప్రమాదమని తెలిసినా సాహసాలకు పూనుకుంటారు. అనుకోని ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా

Viral Video: సముద్రంలో తిరగబడ్డ మంచుఫలకం... కాస్తయితే వారి పరిస్థితి ఏమయ్యేదో!
Ice Berg Riverce

Updated on: Mar 21, 2025 | 5:48 PM

సముద్రాలు అంటేనే ప్రమాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెల్వదు. భారీ అలలు, తిమింగలాలు, తుఫాన్‌లు ఇలా అనేక ప్రమాదాలు సముద్రాల్లో తలెత్తుతుంటాయి. అందుకే వాతావరణ నిపుణులు ఎప్పటికప్పుడు మత్స్యకారులను, పర్యాటకులను అలర్ట్‌ చేస్తుంటారు. ఇక కొంతమంది టూరిస్టులు ప్రమాదమని తెలిసినా సాహసాలకు పూనుకుంటారు. అనుకోని ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.

ఆర్కిట్ ఖండం అంటేనే పూర్తిగా సముద్రం మంచు కొండలతో కూడి ఉంటుంది. అక్కడి రహస్యాల్ని అధ్యయనం చేసేందుకు వెళ్లిన కొందరు ఔత్సాహికులు ఉత్తర ధ్రువం సముద్రంలో తేలి ఆడుతున్న భారీ మంచు ఫలకంపై ఎక్కే ప్రయత్నం చేశారు. ముందుగా ప్లాన్‌ చేసుకున్న ప్రకారం దానిపై తాళ్లు కట్టి వాటి సాయంతో ఎక్కే ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాన్ని మరో బోటులోని సిబ్బంది చూస్తూ ఉండిపోయారు. సాయం అడిగితే చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంతలోనే ఊహించని ప్రమాదం ఎదురైంది.

ఔత్సాహికుల బరువుకు సముద్రంలోని మంచుఫలకం ఒక్కసారిగా కిందామీదా అయింది. వారు ఉన్న వైపు బరువు ఎక్కువగా ఉండటంతో మంచుఫలకం అటువైపు పూర్తిగా తిరగబడింది. సాహసికులు ఉన్న భాగమంతా నీళ్లల్లో మునిగిపోయింది. అయితే, అప్పటికే బోటులో నుంచి గమనిస్తున్న సిబ్బంది అప్రమత్తమై వారిని సేవ్‌ చేశారు.

ఈ వీడియో చూసిన నెటిజన్స్‌ షాక్‌ అవుతున్నారు. ఆ సంఘటనపై రకరాకాలుగా కామెంట్స్‌ పెడుతున్నారు. సముద్రంలో తేలియాడే మంచుఫలకంపై ఎవరైనా ఎక్కాలని అనుకుంటారా? ఇలా చేసి ఏం సాధిద్దామనుకున్నారు అని కొందరు పోస్టులు పెట్టారు. సాహసీకుల ప్రయత్నాన్ని మరికొంత మంది అభినందిస్తున్నారు. రకరకాల కామెంట్స్ మధ్య ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది

 

వీడయో చూడండి: