Funny Video: ఓర్నీ, నీ తెవిలి స‌ల్ల‌గుండా.. పెంపుడు కుక్క చేసిన పనికి ఆ ఇల్లాలు పరేషాన్‌

|

Jun 23, 2024 | 2:54 PM

ఉత్తర ధ్రువానికి సమీపంలో ఉన్న ఈ ప్రాంతం సంవత్సరంలో ఎక్కువ భాగం దట్టమైన మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్‌ 40 డిగ్రీల వరకు పడిపోతుంది. హస్కీలు అక్కడ నివసిస్తుంటాయి. ఫ్రిజ్ లోపల చల్లటి వాతావరణంలో అది చాలా హాయిగా సేద తీరుతోంది. ఇంటర్‌లో నెట్‌లో వీడియోపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు.

Funny Video: ఓర్నీ, నీ తెవిలి స‌ల్ల‌గుండా.. పెంపుడు కుక్క చేసిన పనికి ఆ ఇల్లాలు పరేషాన్‌
Husky Dog Takes Shelter In Fridge
Follow us on

వేసవిలో ఎండతీవ్రత, ఉక్కపోత కారణంగా చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలు భానుడి భగభగలకు మండిపోతున్నాయి. ప్రస్తుతం కొన్నిచోట్ల ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరువలో ఉంది. చాలా చోట్ల హీట్ వేవ్ హెచ్చరికలు కూడా జారీ చేయబడ్డాయి. వేసవి తాపానికి జంతువులు, పక్షులు కూడా ఇబ్బంది పడుతున్నాయి. వేడి నుంచి తప్పించుకోవడానికి ప్రజలు రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా, పక్షులు, జంతువులు సైతం చల్లదనం కోసం వెతుకుతున్నాయి. వేడిని తట్టుకునేందుకు ఓ ఇంట్లోని హస్కీ చేసిన ఫీట్ ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ దేశంలో చాలా మంది విదేశీ జాతి కుక్కలను ఇంట్లో పెంచుకోవడానికి ఇష్టపడతారు. వీటిలో చాలా జాతులు ప్రధానంగా చల్లని దేశాలకు చెందినవి. కాబట్టి అవి భారతదేశ వాతావరణానికి అనుగుణంగా మారడం చాలా కష్టం. ఉదాహరణకు సైబీరియన్ హస్కీ.. నిజానికి ఇది ఒక రష్యన్ జాతి. ఉత్తర ధ్రువానికి సమీపంలో ఉన్న ఈ ప్రాంతం సంవత్సరంలో ఎక్కువ భాగం దట్టమైన మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్‌ 40 డిగ్రీల వరకు పడిపోతుంది. హస్కీలు అక్కడ నివసిస్తుంటాయి. కాబట్టి అవి మన దేశ వేడికి తట్టుకుని ఉండటం కష్టం. అందుకే, అంత వేడిని తట్టుకోలేక ఓ హస్కీ ఇంట్లోని రిఫ్రిజిరేటర్‌లో దూరింది. ఆ వీడియో సోషల్ మీడియాలో చేరింది.. వెంటనే అది వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

హస్కీ వీడియోను అనామిక అనే ఖాతా ద్వారా X హ్యాండిల్‌లో (గతంలో ట్విట్టర్ అని పిలుస్తారు) పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఒక మహిళ ఫ్రిజ్ డోర్ తెరిచి నిలబడి చూస్తుంది. ఆ ఫ్రిజ్‌లో హస్కీ నక్కి కూర్చుని ఉంది. కుక్క చాలా చిన్నగా ఉంది కాబట్టి, అది ఫ్రిజ్‌లోకి ఈజీగా సరిపోయింది.. ఆ మహిళ దాని కాలు పట్టుకుని బయటకు లాగేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఆ కుక్కపిల్ల ఫ్రిజ్‌లోంచి బయటకు రావడానికి ససేమీరా అంటోంది.. ఫ్రిజ్ లోపల చల్లటి వాతావరణంలో అది చాలా హాయిగా సేద తీరుతోంది. ఇంటర్‌లో నెట్‌లో వీడియోపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..