
మొసలి, కొండచిలువ.. రెండూ కూడా ప్రమాదకరమైన జంతువులే.. సాధారణంగా కొండచిలువకు ఏ జీవి కూడా ఎదురుపడాలని అనుకోదు. ఎందుకంటే.! అది చిటికెలో అమాంతం జంతువులను మింగేస్తుంది. అలాగే మొసలి విషయంలోనూ అంతే.! మొసలి నీటిలో ఉన్నా.. బయట ఉన్నా.. భయంకరమైన జంతువు. ఏదైనా దాని కంట పడితే చాలు.. వెంటనే ఆహారంగా మారిపోవాల్సిందే. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూడగానే జనాలు తెగ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నీటిలో మొసలిని ‘సముద్రపు అలెగ్జాండర్’ అని పిలుస్తుంటారు. అటు కొండచిలువ ప్రమాదకరమైనది అయినప్పటికీ.. నీటిలో మొసలికి మాత్రమే బలం ఎక్కువ. అలా కొలనులోకి వచ్చిన కొండచిలువను.. ఓ భారీ మొసలి గమనిస్తుంది. దీంతో ఆ రెండిటి మధ్య యుద్ధం మొదలవుతుంది. వీడియో ప్రకారం.. ఈ రెండు ప్రమాదకరమైన జంతువులు.. ఒకదానితో మరొకటి యుద్ధం చేసుకోవడం మీరు చూడవచ్చు. రెండు భీకరంగా దాడి చేసుకున్నప్పటికీ.. చివరికి మొసలికి కొండచిలువ మొసలికి ఆహారంగా మారిపోయింది. నీటిలో మొసలికి చటుక్కున చిక్కింది కొండచిలువ. తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా.. కుదరలేదు. మొసలి ఏమాత్రం దానిని విడిచిపెట్టలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు దానిపై ఓ లుక్కేయండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి