సాధారణంగా పాములను దూరం నుంచి చూస్తే చాలు మనకు గుండె ఝల్లుమంటుంది. అలాంటిది ఆ పాము మన ఇంట్లో తిష్టవేసిందని తెలిస్తే.? ఇంకేమైనా ఉందా.? గజగజ వణికిపోవాల్సిందే..! ఇలాంటి పరిస్థితే ఓ ఫ్యామిలీకి ఎదురైంది. తమ కిచెన్ పైకప్పు మీద ఏదో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి అని వెళ్లినవారికి ఊహించని షాక్ తగిలింది.
సుమారు మూడు మీటర్ల పొడవు.. 100 పళ్లు.. 8 కేజీల బరువు ఉన్న పెద్ద పైథాన్ కనిపించింది. ఈ భారీ సర్పాన్ని పట్టుకునేందుకు ఆ కుటుంబం స్టీవ్ అనే స్నేక్ క్యాచర్‌ను పిలిచింది. దాన్ని పట్టుకునేందుకు అతడికి సుమారు గంటన్నర సమయం పట్టింది.
ఈ జాతికి చెందిన పైథాన్‌లు విషపూరితం కాదని చెప్పిన స్టీవ్.. ఇంతటి భారీ సైజ్ ఉన్న పైథాన్ ఒక్క కాటు వేసినా అత్యంత ప్రమాదకరమని తెలిపాడు. బ్రిస్బేన్ చుట్టుప్రక్కల ఈ జాతి పైథాన్‌లు తరచూ కనిపిస్తాయని.. ఇంటి పైకప్పుల మీద నివసిస్తూ ఎలుకలను ఆహారంగా తీసుకుంటాయని స్టీవ్ చెప్పుకొచ్చాడు.
Also Read:
ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..
గగుర్పొడిచే దృశ్యం.. పామును సజీవంగా మింగేస్తోన్న మరో పాము.. వీడియో వైరల్.!
SBI కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 డెబిట్ అవుతున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్.!