Viral Video: చేపల కోసం వేటకు వెళ్లాడు.. గాలానికి చిక్కింది చూసి ఖంగుతిన్నాడు.. చివరకు.!
అమెరికాలో చాలామంది వీకెండ్స్‌లో చేపల వేటకు వెళ్తుంటారు. తమ ఇంటికి దగ్గరలోని చెరువు లేదా నదిలో చేపలు పట్టేందుకు..

అమెరికాలో చాలామంది వీకెండ్స్‌లో చేపల వేటకు వెళ్తుంటారు. తమ ఇంటికి దగ్గరలోని చెరువు లేదా నదిలో చేపలు పట్టేందుకు కుతూహలం చూపిస్తుంటారు. ఈ కోవలోనే ఓ వ్యక్తి స్థానిక చెరువులో చేపల వేటకు వెళ్లాడు.. ఇక అతడ్ని ఆశ్చర్యపరుస్తూ.. గాలానికి భారీ చేప చిక్కింది. అదేంటో మీరూ చూసేయండి.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన దగ్గరున్న బోట్ వేసుకుని స్థానికంగా ఉండే చెరువుకు వెళ్లాడు. తన దగ్గర ఉన్న గాలానికి ఎరను కట్టి.. నీళ్లలో విసిరాడు.. కొద్దిసేపటికి గాలం బరువెక్కడమే కాదు.. దానికి చిక్కిన చేపను చూసి అతగాడు ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఓ భారీ సైజ్‌లో ఉన్న క్యాట్ ఫిష్ అతడి గాలానికి చిక్కింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ వీడియోకు ఇప్పటిదాకా లక్షల్లో వ్యూస్ రాగా.. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.
