Viral Photo: బంగారం ఒకటి చెప్పనా.. ఈ ఫోటోలో ‘9’ నెంబర్ గురిస్తేనే కదా.. నీ కళ్లల్లో మ్యాజిక్ తెలిసేది!

|

Sep 23, 2022 | 1:37 PM

ఏ ఫోటో అయినా దాన్ని చూసే దృక్కోణం చెబుతుంది.. అందులో మ్యాజిక్ ఉందా.? లేదా.? అని.. అందుకేనేమో.

Viral Photo: బంగారం ఒకటి చెప్పనా.. ఈ ఫోటోలో 9 నెంబర్ గురిస్తేనే కదా.. నీ కళ్లల్లో మ్యాజిక్ తెలిసేది!
Optical Illusion
Follow us on

ఏ ఫోటో అయినా దాన్ని చూసే దృక్కోణం చెబుతుంది.. అందులో మ్యాజిక్ ఉందా.? లేదా.? అని.. అందుకేనేమో.. ఈ మధ్యకాలంలో విభిన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటినే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ఫోటో పజిల్స్ అని అంటున్నారు. ఇవి నెటిజన్ల బుర్రను గింగిరాలు తిప్పడమే కాదు.. మెదడుకు చురుకుదనాన్ని కూడా ఇస్తున్నాయి. సాధారణంగా మన పని ఒత్తిడిని తగ్గించేందుకు వివిధ రకాల సుడోకోలు, పజిల్స్‌పై దృష్టి సారిస్తుంటాయి. ఆ కోవకు చెందినవే ఈ ఫోటో పజిల్స్. కాని ఇవి కొంచెం విభిన్నంగా ఉంటాయి. అయినా కూడా నెటిజన్లు తగ్గేదేలే అన్నట్లుగా సాల్వ్ చేసేస్తుంటారు. మరి ఆ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్‌ను చూసేద్దాం.. పైన పేర్కొన్న ఫోటోలో మీకేం కనిపిస్తోంది.. ఠక్కున అందరూ ‘8’ నెంబర్స్ అని అంటారు. అయితే అందులో ‘9’ నెంబర్ కూడా ఉంది. అదెక్కడుందో.. ఏ వరుసలో ఉందో.? మీరు చెప్పాలి. లేట్ ఎందుకు మీ బుర్రకు పదునుపెట్టండి.. కళ్లకు పని చెప్పండి.. తీక్షణంగా ఫోటోను చూడండి.. మీకు కచ్చితంగా కనిపిస్తుంది. ఒకవేళ కనిపించలేదా.? సమాధానం కోసం కింద ఫోటో చూడండి.