AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: దొరికింది ఏదో పాతకాలం మట్టికుండ అనుకునేరు.. లోపల అంతులేని ఖజానా..

శతాబ్దాల నాటి మట్టి కింద దాగి ఉన్న గూఢరహస్యం… అనుకోని అన్వేషణలో వెలుగులోకి వచ్చిన అద్భుత సాక్ష్యం… అవును.. ఇదో అద్భుతమే.. ఏకంగా అక్కడ 600 ఏళ్ల క్రితం నాటి రాజుల కాలంలో చలామణిలో ఉన్న అరుదైన సంపద ఇప్పుడు బయటపడింది.

Viral: దొరికింది ఏదో పాతకాలం మట్టికుండ అనుకునేరు.. లోపల అంతులేని ఖజానా..
Medieval CoinsImage Credit source: AGH University in Kraków
Ram Naramaneni
|

Updated on: Aug 21, 2025 | 2:34 PM

Share

పోలాండ్‌లోని బొచ్నియా అరణ్య ప్రాంతంలో చారిత్రక నేపథ్యం ఉన్న అరుదైన సంపద బయటపడింది. 600కి పైగా మధ్యయుగ నాణేల ఖజానా మెటల్ డిటెక్టర్ అన్వేషకులు వెలికితీశారు. వీటిలో వెండి నాణేలతో పాటు అరుదైన బంగారు డుకాట్లు(అప్పట్లో యూరప్ అంతటా చలామణి అయిన అత్యంత విలువైన బంగారు నాణేలు) కూడా ఉన్నాయి. దక్షిణ పోలాండ్‌లోని రాబా నది ఒడ్డున ఉన్న బొచ్నియా పట్టణం పరిసరాల్లోని అడవిలో మెటల్ డిటెక్టర్లతో సర్వే చేస్తూ… కొందరు అన్వేషకులు మట్టిలో పాతుకుపోయిన సెరామిక్ కుండలో నాణేలను కనుగొన్నారు. వెంటనే అధికారులు సమాచారం అందించారు. టార్నోవ్ వారసత్వ విభాగం ఆధ్వర్యంలో… బొచ్నియా ఫిషర్ మ్యూజియం నిపుణులు, క్రాకోవ్‌లోని ఏజిహెచ్ యూనివర్సిటీ సహకారంతో నాణేల తవ్వకాన్ని అత్యంత జాగ్రత్తగా నిర్వహించారు.

దొరికిన కండలో.. 592 వెండి జాగిలోనియన్ డెనారీలు, 26 హాఫ్-గ్రోషెన్ నాణేలు, 4 బంగారు డుకాట్లు బయటపడ్డాయి. ఈ బంగారు నాణేలు 1387 నుంచి 1437 వరకు పాలించిన సిగిస్మండ్ ఆఫ్ లక్సెంబర్గ్ కాలానికి చెందినవని నిపుణులు చెబుతున్నారు. ఆయన ఒకప్పుడు హోలీ రోమన్ ఎమ్పెరర్ మాత్రమే కాకుండా హంగేరీ, బోహేమియా రాజుగానూ పాలించారు. ఆ కాలంలో బొచ్నియా పట్టణం వాణిజ్యానికి ఒక ముఖ్య కేంద్రం. ముఖ్యంగా అక్కడి రాజకుటుంబ ఉప్పు గనులు యూరప్ అంతటా వాణిజ్యానికి దోహదం చేశాయి. నిపుణుల అంచనా ప్రకారం ఈ నిధి ఒక వ్యాపారవేత్త దాచుకున్నది అవ్వొచ్చు. లేదా రాజకీయ కల్లోల సమయంలో దాచిపెట్టిన అత్యవసర నిధి కావచ్చు.

ప్రస్తుతం నాణేలను స్టానిస్లావ్ ఫిషర్ మ్యూజియంలో శాస్త్రీయ సంరక్షణలో ఉంచారు. వాటి విలువ లెక్కింపు పూర్తి అయిన తర్వాత ప్రజలకు శాశ్వత ప్రదర్శనగా అందుబాటులో ఉంచనున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్.. సూపర్ స్కీమ్ ప్రకటించిన సీఎం
విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్.. సూపర్ స్కీమ్ ప్రకటించిన సీఎం
ఆ ఊరు పెరుగు తింటే.. మళ్లీ మళ్లీ కావాలంటారు..
ఆ ఊరు పెరుగు తింటే.. మళ్లీ మళ్లీ కావాలంటారు..
ఈ టైమ్‌లో డీ మార్ట్‌కి అస్సలు వెళ్లకండి! భారీగా డబ్బు ఆదాకావాలంటే
ఈ టైమ్‌లో డీ మార్ట్‌కి అస్సలు వెళ్లకండి! భారీగా డబ్బు ఆదాకావాలంటే
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
వెనక నుండి బైక్ తో కొట్టాడు...కింద పడగానే
వెనక నుండి బైక్ తో కొట్టాడు...కింద పడగానే
ఈ ఆఫర్‌కు భారీ డిమాండ్‌.. అందుకే ఈ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది!
ఈ ఆఫర్‌కు భారీ డిమాండ్‌.. అందుకే ఈ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది!
నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..
నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..