AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: మహిళకు బాడీ స్కాన్ చేయగా.. ఏదో కదులుతూ కనిపించింది.. ఏంటని పరిశీలించగా

ఓ చిత్రమైన ఘటన చైనాలో చోటు చేసుకుంది. ఫెర్రీ బోటులో వచ్చిన మహిళ.. కంగారుగా కనిపించడంతో ఆమెను ప్రశ్నించి.. ఆ తర్వాత చెక్ చేయగా.. ఆమె బాడీ స్కాన్‌లో ఏదో కదులుతూ కనిపించాయి. అదేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి చెక్ చేయండి.

Video: మహిళకు బాడీ స్కాన్ చేయగా.. ఏదో కదులుతూ కనిపించింది.. ఏంటని పరిశీలించగా
Trending Updates
Ravi Kiran
|

Updated on: Aug 21, 2025 | 3:50 PM

Share

కాదేది కవితకు కానర్హం అన్నట్టుగా.. దొరికినవి దొరికినట్టుగా అక్రమ రవాణా చేస్తున్నారు కొందరు. తాజాగా ఓ మహిళ కొన్ని వస్తువులను.. ఇంకా చెప్పాలంటే.! జీవం ఉన్న జంతువులను అక్రమంగా రవాణా చేసింది. అది కూడా ఎలా చేసిందో తెలిస్తే దెబ్బకు షాక్ అవుతారు. వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని ఓ ఫెర్రీ పోర్టులో అంతరించిపోతున్న నాలుగు పాములను ఓ మహిళ తన బ్రాలో దాచి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడింది. IUCN రెడ్ లిస్టులో ఈ బాల్ పైథాన్‌లు(Python regius)అత్యంత ప్రమాదకరమని తేల్చారు. చైనాలో వీటిని రక్షిత జాతిగా పరిగనిస్తారు. వీటిని అక్కడ పెంపుడు జంతువుగా ఉంచుకోవడం చట్టవిరుద్ధం.

చైనా, హాంగ్‌కాంగ్ సరిహద్దులలో ఉన్న ఫుటియన్ పోర్టు వద్ద ఈ అనుమానిత మహిళను పాములతో పట్టుకున్నారు అధికారులు. భద్రతా తనిఖీలు త్వరత్వరగా పూర్తి చేస్తున్న సమయంలో.. సదరు మహిళ కంగారుగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు ఆమెను లోతుగా చెక్ చేశారు. ఆమెకు బాడీ స్కాన్ చేయగా.. డిటెక్టర్‌లో ఆమె బ్రాలో సాక్స్‌లో చుట్టబడిన నాలుగు కొండచిలువలు కనిపించాయి. దీంతో దెబ్బకు ఆశ్చర్యపోయారు అధికారులు. ఇక ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా.. ‘కొంత డబ్బుల కోసం.. ఎవరో చెప్పిన పనికి తాను ఈ సరీసృపాలను తీసుకొచ్చానని’ స్పష్టం చేసింది.

అధికారులు ఆ పాములను బాల్ పైథాన్‌లుగా గుర్తించారు. ఇవి అంతరించిపోతున్న జాతులలో ఒకటిగా కనుగొన్నారు. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత నెల చివరివారంలోనూ అమెరికాలోని మయామి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక మహిళ ఆమె బ్రాలో రెండు తాబేళ్లను దాచిపెట్టుకుని అక్రమ రవాణా చేస్తూ దొరికింది. అంతేకాదు వాటిల్లో ఒకటి చనిపోయినట్టుగా ఆ సమయంలో అధికారులు గుర్తించారు.

Follow Us
మనవరాలితో కలిసి అద్భుతంగా పాడిన సింగీతం శ్రీనివాసరావు..
మనవరాలితో కలిసి అద్భుతంగా పాడిన సింగీతం శ్రీనివాసరావు..
విమానంలో భర్త పై దాడి.. భార్య రియాక్షన్‌ ఇదీ!
విమానంలో భర్త పై దాడి.. భార్య రియాక్షన్‌ ఇదీ!
ఆ ఊర్లో అర్ధరాత్రి ఇళ్లపై రాళ్ల వర్షం.. భయంతో వణికిపోతున్న జనాలు!
ఆ ఊర్లో అర్ధరాత్రి ఇళ్లపై రాళ్ల వర్షం.. భయంతో వణికిపోతున్న జనాలు!
ఒక్క మ్యాచ్ ఆడకుండానే గోల్డ్ మెడల్ పట్టేసిన ముగ్గురు..!
ఒక్క మ్యాచ్ ఆడకుండానే గోల్డ్ మెడల్ పట్టేసిన ముగ్గురు..!
రూ.20 వేలలోపే పెట్టుబడి.. నెలకు రూ.40 వేల వరకు ఆదాయం!
రూ.20 వేలలోపే పెట్టుబడి.. నెలకు రూ.40 వేల వరకు ఆదాయం!
పాకం పట్టకుండా స్పెషల్ లడ్డు.. చిన్న పిల్లలు తెగ తింటారు
పాకం పట్టకుండా స్పెషల్ లడ్డు.. చిన్న పిల్లలు తెగ తింటారు
ఓటీటీలో 'స్పైడర్ మ్యాన్' కొత్త సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో 'స్పైడర్ మ్యాన్' కొత్త సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఒక్క మ్యాచ్‌లో హిట్.. వరుసగా అట్టర్ ఫ్లాప్.. ఇంక ఇంటికేనా?
ఒక్క మ్యాచ్‌లో హిట్.. వరుసగా అట్టర్ ఫ్లాప్.. ఇంక ఇంటికేనా?
షుగర్ కంట్రోల్‌కు, బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన కొర్రల అన్నం
షుగర్ కంట్రోల్‌కు, బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన కొర్రల అన్నం
మహాలయ అమావాస్య.. ఈ వస్తువు ఇంటికి తెస్తే ఆర్థిక సమస్యలు వస్తాయట..
మహాలయ అమావాస్య.. ఈ వస్తువు ఇంటికి తెస్తే ఆర్థిక సమస్యలు వస్తాయట..