Indian railway: ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా..? అయితే, ఇది మీ కోసమే..

కిటికీ పక్కన కూర్చుని ప్రయాణిస్తుంటే, ప్రతి కొన్ని గంటలకూ బయట ప్రపంచం మారిపోతుంటే ఆ అనుభూతి ఎలా ఉంటుంది? ఒకవైపు పంజాబ్ పచ్చని పొలాలు, మరోవైపు మధ్యప్రదేశ్ అడవులు, ఇంకోవైపు దక్షిణ భారతదేశపు కొబ్బరి తోటలు.. ఇవన్నీ ఒకే ప్రయాణంలో చూడాలనుకుంటున్నారా..? ఇది మన ఇండియన్‌ రైల్వేకే సాధ్యం. భారతీయ రైల్వేకు దేశంలో ఒక చివర నుండి మరొక చివర వరకు ప్రయాణించే ఒక ప్రత్యేకమైన రైలు ఉంది. ఇది కేవలం ఒక రైలు మాత్రమే కాదు, పట్టాలపై నడిచే ఒక మినీ ఇండియాగా పిలుస్తారు. ఇది 12 రాష్ట్రాల సంగ్రహావలోకనాన్ని అందిస్తుంది. ఈ అద్భుతమైన ప్రయాణం గురించి తెలుసుకుందాం.

Indian railway: ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా..? అయితే, ఇది మీ కోసమే..
Longest Train Journey In India

Updated on: May 21, 2026 | 3:21 PM

భారతీయ రైల్వేను ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్ అని ఊరికే అనరు. ఇది ఎన్నో రికార్డులు, అద్భుతాలను కలిగి ఉంది. అలాంటి ఒక అపురూపమైన ఆణిముత్యమే హిమసాగర్ ఎక్స్‌ప్రెస్. ఇది దేశంలో ఉత్తరాన్ని దక్షిణంతో నేరుగా కలిపే ఏకైక రైలు. మాతా వైష్ణో దేవి కత్రా నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించి, ఇది నేరుగా కన్యాకుమారి వద్ద ముగుస్తుంది. తన ప్రయాణంలో, ఇది మొత్తం 3,790 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. ఈ దూరం అత్యంత అనుభవజ్ఞులైన ప్రయాణికులను సైతం ఆశ్చర్యపరుస్తుంది.

12 రాష్ట్రాల సంస్కృతుల కలయిక:

ఈ సుదీర్ఘ ప్రయాణంలో ప్రయాణికులకు అస్సలు బోర్ కొట్టదు. ఎందుకంటే ఈ రైలు భారతదేశంలోని 12 రాష్ట్రాల గుండా సాగుతుంది. జమ్మూ-కశ్మీర్, పంజాబ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలను ఇది కవర్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల మీదుగా కూడా ఈ రైలు వెళ్తుంది.

69 స్టేషన్లు.. రకరకాల రుచులు:

హిమసాగర్ ఎక్స్‌ప్రెస్ తన మార్గంలో 69 ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ప్రతి స్టాప్‌లోనూ ప్రయాణికులకు సరికొత్త భాష, విభిన్నమైన సంస్కృతి, స్థానిక రుచులు పరిచయమవుతాయి. పంజాబీ పరాటాల నుండి దక్షిణాది ఇడ్లీ, సాంబార్, కొబ్బరి నీళ్ల వరకు ఎన్నో రకాల ఆహారాలను ఈ ప్రయాణంలో ఆస్వాదించవచ్చు.

ఇవి కూడా చదవండి

భారతదేశంలోని వైవిధ్యాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రత్యక్షంగా అనుభవించాలనుకునే ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ట్రావెల్ లవర్స్ తమ జీవితంలో ఒక్కసారైనా హిమసాగర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాలి. ఇది కేవలం ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లే సాధనం మాత్రమే కాదు, జీవితాంతం గుర్తుండిపోయే ఒక గొప్ప అనుభూతి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us