
అది ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ సన్‌షైన్ కోస్టల్ ఏరియా. ఉదయాన్ని చాలామంది సముద్రం ఒడ్డున వాకింగ్ చేస్తున్నారు. ఈలోగా వారికి దూరం నుంచి ఓ నల్లటి ఆకారం కనిపించింది. ఏమై ఉంటుందోనని అనుమానమొచ్చి.. దగ్గరకు వెళ్లి చూడగా.. మైండ్ బ్లాంక్ అయింది. ఓ భారీ పాము దర్శనమిచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ సన్‌షైన్ కోస్ట్‌లో ఓ భారీ పాము అటుగా వాకింగ్ చేస్తోన్న వ్యక్తులకు దర్శనమిచ్చింది. మొదటిగా ఆ భారీ సైజున్న పామును తిరిగి సముద్రంలోకి విడిచిపెడామనుకున్నారు. కానీ ఆ పాము కదల్లేని పరిస్థితిలో ఉండటం వల్ల.. వెంటనే స్థానికంగా ఉన్న సన్‌షైన్ కోస్ట్ స్నేక్ క్యాచర్లకు సమాచారాన్ని అందించారు.
అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్లు.. దాన్ని చూసి షాక్ అయ్యారు. ఆ పాము చాలా విషపూరితమైనదని.. దానిని స్టోక్స్ సముద్రపు పాము అని పిలుస్తారని చెప్పుకొచ్చారు. ఇలాంటి పాములను తాకితేనే ప్రాణాలకు ప్రమాదమని.. తిరిగి సముద్రంలోకి వదిలేయాలన్న ప్రయత్నం కూడా చేయొద్దని హెచ్చరించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.