అసురక్షిత శృంగారం మంచిది కాదని డాక్టర్లు పదే, పదే చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల ఎన్నో వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయంటారు. అందుకే శృంగారం చేసే సమయంలో కండోమ్ వాడాలని సూచిస్తారు. శృంగారం చేసేటప్పుడు సురక్షితమైన పద్దతులను పాటించడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చేసిన ఓ సర్వేలో వెల్లడైంది. శృంగార సంబంధిత అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటీ.. అది అన్ని వర్గాల ప్రజలకు చేరువవ్వడం లేదు. నేషనల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్ (2021-22) నిర్వహించిన సర్వే ప్రకారం, భారతదేశంలో అత్యధిక కండోమ్ వినియోగదారుల జాబితాలో దాద్రా నగర్ హవేలీ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 10 వేల జంటలలో 993 జంటలు శృంగార సమయంలో కండోమ్‌లను ఉపయోగిస్తున్నారని అంచనా. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. ఏపీలో 10 వేల జంటల్లో 978 మంది కండోమ్‌లు వాడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
కర్ణాటకలో కండోమ్ వాడకంపై మరింత అవగాహన పెరగాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కండోమ్ వాడకంలో కర్ణాటక 15వ స్థానంలో ఉంది. అక్కడ 10,000 జంటల్లో కేవలం 307 మంది మాత్రమే కండోమ్‌లు వాడుతున్నారు. పుదుచ్చేరిలో 960 జంటలు వినియోగిస్తున్నాయి. పంజాబ్ 895, చండీగఢ్ 822, హర్యానా 685, హిమాచల్ ప్రదేశ్ 567, రాజస్థాన్ 514, గుజరాత్‌లో 430 జంటలు శృంగారం సమయంలో కండోమ్‌లు వినియోగిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇటీవల విడుదల చేసిన నివేదికలో భారత్‌లో కండోమ్ లేకుండా శృంగారం చేసే ట్రెండ్ పెరిగిపోయిందని వెల్లడించింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..