ప్రేమ ఏదైనా సాధించగలదంటున్నారు ఈ ఇద్దరు ప్రేమికులు. ఎప్పుడు ఎవరిపై ప్రేమ ఎలా పుడుతుందో చెప్పలేమంటున్నారు. అవతలి వ్యక్తి రూపంతో సంబంధం లేకుండా కలిసిపోయే మనసులదే ప్రమంటున్నారు. అలాంటి ఓ జంట ప్రేమ కథ ఇప్పుడు నేటింట తెగ హల్చల్ చేస్తోంది. ఈ జంటను మొదటిసారి చూసినా ఎవరూ కూడా ఈ ఇద్దరు భార్యాభర్తలంటే నమ్మలేరు. ఎందుకంటే ఆ జంట ఎత్తుల విషయంలో ఊహించని తారతమ్యం కనిపిస్తుంది. భర్త ఎత్తు చాలా తక్కువ. భార్య ఎత్తు చాలా ఎక్కువ. పైగా ఈ జంట ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత ఈ జంట గరిష్ట ఎత్తు తేడాతో ప్రపంచ రికార్డును కూడా సృష్టించింది. ఈ జంట ఎవరు, వారి ప్రేమ కథ ఎలా ఉంది? కూడా తెలుసుకోండి.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, ఈ జంట పేరు జేమ్స్ లస్టెడ్ మరియు క్లో సమంతా లస్టెడ్, వీరు 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారిద్దరూ నార్త్ వేల్స్ (UK)లో నివసిస్తున్నారు. ఇద్దరిదీ ఒకే ఊరు. జేమ్స్ వయసు 33 సంవత్సరాలు, అతను నటుడు ఇంకా ప్రెజెంటర్. అతని భార్య క్లో టీచర్. ఆమె వయస్సు 29 సంవత్సరాలు. జూన్ 2, 2021న, వారిద్దరూ వివాహిత జంటలలో అత్యధిక ఎత్తు తేడాతో రికార్డు సృష్టించారు. జేమ్స్ 109.3 cm (3 ft 7 in) ఎత్తు, అతని భార్య క్లో 166.1 cm (5 ft 5.4 in) ఎత్తు. ఇద్దరి మధ్య 56.8 సెం.మీ అంటే దాదాపు 2 అడుగుల (1 అడుగులు, 10 అంగుళాలు) తేడా ఉంది.
అందిన సమాచారం ప్రకారం.. జేమ్స్ మరుగుజ్జు.. అరుదైన రూపాలలో ఒకటైన డయాస్ట్రోఫిక్ డైస్ప్లాసియాతో బాధపడుతున్నాడు. ఇది జన్యుపరమైన రుగ్మత. ఇది ఎముకలు, నాడీ వ్యవస్థ పెరుగుదలను నిలిపివేస్తుంది. అతని మరుగుజ్జుతనం కారణంగా, జేమ్స్ అతను ఎప్పటికీ పెళ్లి చేసుకోనని అనుకున్నాడు, కానీ 2012లో, జేమ్స్ క్లోను కలుసుకున్నాడు. అతని మనసు మార్చుకున్నాడు.
ఈ సందర్భంగా వారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌తో క్లో మాట్లాడుతూ,..మొదటి నుండి పొడవాటి వ్యక్తులంటే నా ప్రాధాన్యత. కానీ నేను జేమ్స్‌ని కలిసినప్పుడు, నేను అతనితో ప్రేమలో పడ్డాను. ప్రజలు రకరకాలుగా చెబుతారని నాకు తెలుసు. కానీ అవి నాపై ఎలాంటి ప్రభావం చూపలేదని అన్నారు. తామిద్దరం స్థానిక క్లబ్లో కలుసుకున్నామని, నేను ఆ సమయంలో చదువుకుంటున్నానని చెప్పారు. దూర సంబంధాలలో సమస్యలు రావడం ప్రారంభించాయి. చివరగా, 2013 చివరిలో ఏడు నెలల డేటింగ్ తర్వాత, జేమ్స్ నన్ను లేక్ వాక్ కోసం తీసుకెళ్లాడు. అది పూర్తి చేయడానికి వెళ్లి అతను నన్ను తన మోకాలిపై కూర్చోబెట్టి ప్రపోజ్ చేశాడు. ఆ అనుభూతి నాకు చాలా బాగుంది. ప్రపోజల్ కి ఒప్పుకుని పెళ్లి చేసుకున్నాను. ఈ రోజు మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నామని చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి