Heart Touching Video:ప్రేమ, స్నేహం, విశ్వాసం భావోద్వేగాలను ప్రదర్శించడంలో తాము మనుషుల కంటే ఏ మాత్రం తక్కువ కాదంటూ కుక్క, పిల్లి. ఏనుగువంటి జంతువులు పలు సందర్భాల్లో తెలియజేశాయి. తాజాగా ఓ నెమలి.. తన చిరకాల స్నేహితుడికి వీడ్కోలు పలికిన విధానం.. మనసుకు హత్తుకునే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాజస్థాన్‌లోని కుచెరా టౌన్‌కు చెందిన రామ్ స్వరూప్ బిష్ణోయ్ జంతు ప్రేమికుడు. గత కొన్ని సంవత్సరాలుగా రెండు మూడు నెమళ్లు రోజూ రామ్ ఇంటికి వస్తున్నాయి. వాటికీ రోజు ప్రేమగా తినడానికి గింజలు వేస్తున్నాడు. దీంతో రామ్ స్వరూప్ కి నెమళ్ళు కుటుంబ సభ్యుల్లా కలిసిపోయాయి. అయితే కాలక్రమంలో ఒక నెమలి వృద్ధాప్యంతో మరణించింది. నెమలి మృతితో మరొక నెమలి కన్నీరు పెట్టింది. నెమలి మృత దేహాన్ని పూడ్చడానికి ఇద్దరు యువకులకు చెప్పాడు. నెమలి దహన సంస్కారాల కోసం మృతదేహాన్ని తీసుకువెళుతున్నప్పుడు .. ఒక నెమలి కన్నీరు పెడుతూ వారిని వెంబడించింది. నెమలి మృత దేహాన్ని ఖననం చేసేదాకా ఆ నెమలి అక్కడే ఉంది.
భారత ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కాస్వాం తన ట్విటర్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేశారు. నెమలి తన సహచర నెమలిని విడిచి ఉండలేకపోతోంది. హృదయాన్ని కదిలించే వీడియో.. అంటూ ఓ కామెంట్ జత చేశారు. హృదయాలను కదిలిస్తున్న ఈ వీడియో లక్షలాది మంది వీక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటి వరకూ 1.26 లక్షల మంది వీక్షించారు. మనుషుల కంటే పక్షులు, పశువులకే ప్రేమ అధికంగా ఉంటుంది.. నెమలి ఎంత బాధ అనుభవిస్తోందో.. పక్షి ప్రేమికులకు తెలుస్తుంది… ప్రేమ స్నేహం, బంధం , అనుబంధః విలువ నేటి జనరేషన్ కు ఈ నెమలి చెబుతుంది… హార్ట్ టచింగ్ వీడియో అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
The peacock doesn’t want to leave the long time partner after his death. Touching video. Via WA. pic.twitter.com/ELnW3mozAb
— Parveen Kaswan (@ParveenKaswan) January 4, 2022
Also Read: కెమికల్ ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్.. ఆరుగురు మృతి.. 25 మందికి తీవ్ర అస్వస్థత