Viral Video: ఈ వీడియో మీ మనసులను తాకుతుంది.. చిట్టి తల్లి మనసు ఎంత పెద్దదో

సోషల్ మీడియా వేదికగా రోజూ రకరకాల వైరల్ వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. అందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే.. మరికొన్ని భావోద్వేగాలను కలిగించే వీడియోలు ఉంటాయి.

Viral Video: ఈ వీడియో మీ మనసులను తాకుతుంది.. చిట్టి తల్లి మనసు ఎంత పెద్దదో
Kids Caring Nature

Updated on: Nov 26, 2021 | 6:59 PM

సోషల్ మీడియా వేదికగా రోజూ రకరకాల వైరల్ వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. అందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే.. మరికొన్ని భావోద్వేగాలను కలిగించే వీడియోలు ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోలు చాలా క్యూట్‌గా, ఎమోషనల్‌గా ఉంటాయి. చిన్నప్పటి నుంచి పిల్లలకు మంచి విలువలు నేర్పిస్తే.. వారు జీవితాంతం అవే ఆచరిస్తారు. తమకు పుట్టబోయే బిడ్డలకు కూడా అవే విలువలు వారసత్వంగా ఇస్తారు. తాజాగా వైరల్ అవుతోన్న వీడియో మీ కళ్లను చెమర్చేలా చేస్తుంది. అందులో ఓ చిన్నారి చాలా ఆప్యాయంగా వృద్ధుడికి ఆహారం తినిపిస్తోంది.

వైరల్ అవుతున్న వీడియోలో, ఒక చిన్నారి మంచం మీద కూర్చోవడం.. అదే మంచంపై ఓ వృద్ధుడు కూడా పడుకుని ఉండటం కూడా మీరు చూడవచ్చు. వృద్ధుడు లేచి కూర్చుని ఆహారం తినే పరిస్థితుల్లో లేడని మీరు గమనించవచ్చు. దీంతో ఆ చిన్నారి స్వయంగా తన చేత్తో అతడికి ఆహారం తినిపించింది.  ఆ ఆహారం కాలుతూ ఉండంటంతో ఊది మరీ.. నోట్లో పెడుతుంది.

ఈ వైరల్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో anna._.can అనే పేజ్ నుంచి షేర్ చేశారు. ప్రజంట్ ఈ వీడియో నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. దీన్ని నెటిజన్లు విపరీతంగా లైక్ చేస్తున్నారు. కల్మషం లేని చిన్నారి మనసు ఎంతో గొప్పది అంటూ ప్రశంసిస్తున్నారు. వీడియో తమ మనసుకు తాకిందంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also Read: ‘ఛత్రపతి’ సూరీడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..? మీరు అస్సలు గుర్తుపట్టలేరు

కాటేసిన పాము.. పసుపు రాసి నిద్రపుచ్చిన ఆయమ్మ.. పాపం చిట్టి తల్లి