Heart Touching Story: కుక్క, పిల్లి, పిచ్చుక, పావురం, కుందేలు, ఆవులు ఇలా ఏ ప్రాణినైనా పెంచుకునేందుకు జంతు ప్రేమికులు మక్కువు చూపుతుంటారు. కొన్ని జంతువులు మనం వాటిని ఎలా ప్రేమిస్తున్నామో.. అదే విధంగా అవి కూడా మనల్ని ప్రేమిస్తాయి. యజమాని పట్ల తమ ప్రేమను వ్యక్తం చేస్తాయి. అయితే మిగిలిన అన్ని జంతువుల్లోకి భిన్నం కుక్క.. అత్యంత విశ్వాసంగల జంతువు. ఒక మంచి మిత్రుని లా ఉంటుంది. తమకు అన్నం పెట్టిన వారి రక్షణ కోసం నిలబడుతుంది. అవసరమైతే తన ప్రాణాలు సైతం అర్పిస్తోంది. అందుకనే ఎక్కువుగా మనుసులు కుక్కలను పెంచుకుంటారు. తమ కుటుంబ సభ్యులతో సమానంగా ప్రేమను చూపిస్తారు. తాజాగా హృదయాన్ని హత్తుకునే ఓ కుక్క కథ ప్రపంచవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. కుక్క సముద్రంలో వేటకు వెళ్లిన తన యజమాని అయిన జాలరి తిరిగి వచ్చే రోజు కోసం ఎదురు చూస్తూ.. ప్రతిరోజూ బీచ్‌కి వెళ్తుంది. వాగిటో అనే ఈ కుక్క కథను ఒక పెరువియన్ మహిళ( Peruvian woman) సోషల్ మీడియా(Social Media) లో పోస్ట్ చేసింది.
పెరూలోని పుంటా నెగ్రా తీరంలో తాను నడుచుకుంటూ వెళుతున్నప్పుడు సముద్రం వైపు ఆర్తిగా తదేకంగా చూస్తున్న కుక్క గురించి పెరువియన్ మహిళ వివరాయించింది. నెగ్రాకు చెందిన ఓ జాలరి చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్ళాడు. అయితే అతను వేటకు వెళ్లి దురదృష్టవశాత్తు మరణించాడు. అయితే అతని పెంపుడు కుక్క ‘వాగిటో’ సముద్రంలోకి వెళ్లిన తన యజమాని తిరిగి వస్తాడని.. రోజు ఆ సముద్ర తీరంలో ఆశగా ఎదురుచూస్తుంది. ఈ విషయం తాను గమనించి స్థానికులను ఆ కుక్క గురించి అడిగినట్లు జోలీ మెజియా అనే పెరువియన్ మహిళ చెప్పింది.
నడుచుకుంటూ వెళుతుండగా వాగిటోను చూసింది. ఆ శునకం బాధలో ఉన్నట్లు, చాలా రోజులుగా తిండి లేకుండా ఏడుస్తున్నట్లు గమనించింది. అది సముద్రం వైపు ఎందుకు చూస్తుంది? ఎవరి రాకకోసం ఎదురుచూస్తుంది? అని తెలుసుకునే ప్రయత్నం చేసింది.
వాగిటో కు కుక్క యజమానికి మంచి బంధంఉంది. రోజూ ఆ జాలరి తాను ఎక్కడికి వెళ్లినా ప్రతి చోటకు తన పెంపుడు కుక్కను తీసుకుని వెళ్ళేవాడు. ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అయితే ఒకరోజు మత్య్సకారుడు తాను సముద్రంలోకి వేటకు వెళ్తూ.. కుక్కను సముద్రం వద్దకు తీసుకుని వెళ్ళాడు.. అప్పుడు కుక్క తన యజమానికి వీడ్కోలు చెప్పింది. అయితే అతను మరణించినందున తిరిగి రాలేదు. అయినప్పటికీ సముద్రంలోకి వెళ్లేముందు యజమానికి బై చెప్పిన శునకం.. అతను ఎప్పటికైనా వస్తాడనే ఆశతో ప్రతిరోజూ ఉదయం సముద్రం వద్దకు చేరుకుంది. సాయంత్రం వరకూ ఎదురుచూస్తుంది. ఈ కథను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ కథ.. నెటిజన్ల హృదయాలను ద్రవింపజేస్తోంది.
జాలరి మరణించడంతో ఒంటరైపోయిన ఆ కుక్కను జోలీ మెజియా చేరదీసింది. ఎంతో ప్రేమగా చూస్తుంది. అయినప్పటికీ ప్రతిరోజూ వాగిటో సముద్ర తీరానికి వచ్చి కొన్ని గంటలపాటు తన యజమాని తిరిగి వస్తాడని ఎదురు చూస్తుంటుంది. వాగిటో గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ మేరకు కుక్క సముద్రంలోకి ఆత్రుతగా చూస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read:
UP MLC Elections: యూపీలో మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల సందడి.. 30 మంది బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల