భారత ఆటగాళ్లే కాదు, నటులు, రాజకీయ నాయకులు కూడా క్రికెట్‌ను ఇష్టపడతారు. ఎవరైనా మైదానంలో ఆడుతూ కనిపిస్తే సామాన్యుడే కాదు రాజకీయ నాయకులు కూడా వాళ్లతో క్రికెట్ ఆడకుండా ఉండలేరు.. అలాంటి దృశ్యమే గుజరాత్‌లోని పోర్‌బందర్‌లోని ఓ మైదానంలో కనిపించింది. బీజేపీ ప్రభుత్వ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవ్య స్థానిక యువకులతో కలిసి క్రికెట్ ఆడారు. ఈ సమయంలో అతను బౌలింగ్, బ్యాటింగ్ చేసి అందరినీ అలరించారు. తను కూడా గేమ్ బాగా ఎంజాయ్ చేశారు. అనంతరం ఆటగాళ్లందరితో కరచాలనం చేస్తూ అందరినీ అప్యాయంగా పలకరించారు.
బిజీ బిజీ ఎన్నికల షెడ్యూల్ నుండి సమయాన్ని వెచ్చిస్తూ, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గుజరాత్‌లోని పోర్‌బందర్‌లోని మల్టీపర్పస్ గ్రౌండ్‌లో స్థానికులతో క్రికెట్ ఆడుతూ కనిపించిన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
51 ఏళ్ల మాండవ్య తన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో పోరుబందర్ నుంచి పోటీ చేయబోతున్నారు. పార్లమెంటుకు సైకిల్ తొక్కడం కోసం “గ్రీన్ ఎంపీ”గా పేరుగాంచిన మంత్రి, నల్లటి టీ-షర్టు ధరించి, అవుట్‌ఫీల్డ్‌లో బౌలింగ్ చేయడం, బ్యాటింగ్ చేయడం ఫీల్డింగ్ చేయడం చూసి స్థానికులంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
#WATCH | Union Health Minister and BJP leader Mansukh Mandaviya plays cricket with locals in Porbandar, Gujarat.
(Source: Manshukh Mandaviya's Office) pic.twitter.com/gdfTorBABr
— ANI (@ANI) March 29, 2024
2002లో గుజరాత్‌లో అత్యంత పిన్న వయస్కుడైన ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించిన మన్సుఖ్ మాండవియా.. 2012లో గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2016లో అతను రోడ్డు రవాణా, రహదారులు, షిప్పింగ్, రసాయనాలు, ఎరువులు శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2018లో మళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈసారి మాండవ్యకు పోర్‌బందర్ నుంచి లోక్‌సభ టిక్కెట్ ఇచ్చారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…