Viral Video: ఇక్కడ నేనుంటే.. అలా ఎలా పడుకుంటావ్..! గాఢ నిద్రలో ఉన్న కుక్కను లేపిన తాబేలు.. చివరకు ఊహించని షాక్

|

May 09, 2022 | 12:03 PM

క్రూరంగా కనిపించే కుక్క.. ఓ చిన్న తాబేలుకు స్నేహితుడు కాగలదా? బహుశా ఈ ప్రశ్న మదిలో వస్తే.. కాలేదు అనే సమాధానం వెంటనే వస్తుంది.

Viral Video: ఇక్కడ నేనుంటే.. అలా ఎలా పడుకుంటావ్..! గాఢ నిద్రలో ఉన్న కుక్కను లేపిన తాబేలు.. చివరకు ఊహించని షాక్
Tortoise Dog Viral Video
Follow us on

Tortoise Dog Viral Video: సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని క్యూట్‌గా.. మరికొన్ని క్రూరంగా ఉంటాయి. తాజాగా.. ఓ కుక్క.. తాబేలుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా క్రూరంగా కనిపించే కుక్క.. ఓ చిన్న తాబేలుకు స్నేహితుడు కాగలదా? బహుశా ఈ ప్రశ్న మదిలో వస్తే.. కాలేదు అనే సమాధానం వెంటనే వస్తుంది. కానీ ఇక్కడ.. ఊహకి అందని విధంగా కుక్క.. తాబేలు ఒక దగ్గరే కనిపించాయి. కుక్కపిల్ల-తాబేలు స్నేహానికి సంబంధించిన సన్నివేశం మీ అభిప్రాయాన్ని మార్చవచ్చు. ఎందుకంటే.. వాటి హావభావాలను చూస్తుంటే ఇవి రెండూ ఫ్రెండ్స్‌గా కనిపిస్తున్నాయి. కుక్క-తాబేలుకు సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇందులో అలసిపోయిన నిద్రపోతున్న (కుక్క) స్నేహితుడిని తాబేలు.. పదేపదే తట్టి లేపుతోంది. ఈ క్రమంలో కుక్క చేసిన పనితో (Social Media) నెటిజన్లు అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

వైరల్ వీడియోలో.. కుక్కను నిద్ర నుంచి లేపడానికి తాబేలు చేసిన ఈ చర్య చాలా అందంగా కనిపిస్తుంది. కానీ కుక్క స్పందించే విధానం చూసి.. మొదట భయమేస్తుంది. వీడియోలో ఎండలో అలసిపోయి నిద్రపోతున్న కుక్క దగ్గరకు.. తాబేలు రావడాన్ని చూడవచ్చు. అది వచ్చి రాగానే.. దాన్ని నిద్రలేపేందుకు ప్రయత్నిస్తుంది. అయితే.. తాబేలు వేధించడాన్ని తట్టుకోలేని.. డాగీ తన పెద్ద పాదంతో తాబేలును జరిపి.. రెండు కాళ్ల మధ్య నొక్కిపడుతుంది. అయితే ఈ ఘటనలో తాబేలుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో.. 

ఈ వైరల్ వీడియోను.. IFS అధికారి డాక్టర్ సామ్రాట్ గౌడ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ క్యూట్ వీడియోను నెటిజన్లు వీక్షించి.. పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి సన్నివేశాన్ని ఇప్పటివరకు చూడలేదని.. అమేజింగ్ అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Viral Video: ఆర్ఆర్ఆర్ పాటకు దుమ్మురేపిన యువకులు.. మట్టిలో దొర్లుతూ.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే..

Viral Video: మానవత్వం అంటే ఇదే.. కోతి దాహం తీర్చిన యువకుడు.. హ్యాట్సాఫ్‌ అంటున్న నెటిజన్లు