క్లిక్.. క్లిక్.. ఫోటోగ్రాఫర్‌గా కొత్త అవతారమెత్తిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

|

Aug 20, 2021 | 3:59 PM

World Photography Day 2021: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఫోటోగ్రాఫర్‌గా సరికొత్త అవతారమెత్తారు. నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉండే ఆయన.. ఫోటో కెమెరాను చేతబట్టి క్లిక్ క్లిక్‌ మనిపించారు.

క్లిక్.. క్లిక్.. ఫోటోగ్రాఫర్‌గా కొత్త అవతారమెత్తిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
Haryana Governor Bandaru Dattatreya
Follow us on

Haryana Governor Bandaru Dattatreya: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఫోటోగ్రాఫర్‌గా సరికొత్త అవతారమెత్తారు. నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉండే ఆయన.. ఫోటో కెమెరాను చేతబట్టి క్లిక్ క్లిక్‌ మనిపించారు. పచ్చని గార్డెలోని ప్రకృతి రమణీయ దృశ్యాలను తన కెమెరాలో బంధించారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేళ(ఆగస్టు 19) తనకు ఫోటోగ్రఫీ మీదనున్న మక్కువను ఆయన ఇలా చాటుకున్నారు. హర్యానా రాజధాని చండీగఢ్‌లోని రాజ్ భవన్‌లో ఆయన ఫోటోలు తీశారు.

ఫోటోగ్రఫీ ఓ గొప్ప కళగా 74 ఏళ్ల బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. అద్భుతమైన దృశ్యాలు, జీవితంలో మరువలేని సందర్భాలను తమ కెమెరాలలో బంధించే ఫోటోగ్రాఫర్లకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఫోటోలు తీయడం ఓ గొప్ప అనుభూతిని కలిగిస్తుందని అన్నారు. వరల్డ్ ఫోటోగ్రఫీ రోజున కొన్ని ఫోటోలు తీసేందుకు తాను ప్రయత్నించినట్లు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయడంలో దత్తన్న కీలక పాత్ర పోషించారు. బీజేపీలో ఆయన ప్రస్థానం నాలుగు దశాబ్ధాలపాటు కొనసాగింది. మూడుసార్లు సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహించిన ఆయన… వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. నరేంద్ర మోడీ కేబినెట్‌లోనూ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 2019లో కేంద్ర ప్రభుత్వం బండారు దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించింది. గత మాసం ఆయన్ను హర్యానా గవర్నర్‌గా నియమించింది కేంద్రం.

Also Read..

2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. త్వరలో కేబినెట్ విస్తరణ

ఆప్ఘన్‌లో మళ్లీ కాలకేయుల రాజ్యం.. భారత్ మౌనం వెనుక కారణాలు