Har Ghar Tiranga: ‘హర్‌ ఘర్‌ తిరంగా’ను ఇండియన్‌ కోస్టల్‌ గార్డ్‌ ఎలా జరిపిందో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. వైరల్‌ అవుతోన్న వీడియో..

| Edited By: Janardhan Veluru

Aug 04, 2022 | 5:09 PM

Har Ghar Tiranga: ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణను కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఆజాదీకా అమృత్‌ మహోత్సవం పేరుతో 75వ స్వాంత్రత్య దినోత్సవ వేడుకలను...

Har Ghar Tiranga: హర్‌ ఘర్‌ తిరంగాను ఇండియన్‌ కోస్టల్‌ గార్డ్‌ ఎలా జరిపిందో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. వైరల్‌ అవుతోన్న వీడియో..
Follow us on

Har Ghar Tiranga: ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణను కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఆజాదీకా అమృత్‌ మహోత్సవం పేరుతో 75వ స్వాంత్రత్య దినోత్సవ వేడుకలను అంగరంగవైభవంగా జరుపుతోంది. ఇందులో భాగంగా రకరకాల కార్యక్రమాలు చేపడుతోంది. వీటిలో ఒకటి ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ప్రోగ్రామ్‌. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఒక్కరూ ఆగస్టు 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇళ్లపై జాతీయ జెడా ఎగరవేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

ఇప్పటికే పలు ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు తమ కంపెనీల లోగోల్లో జాతీయ జెండాను చేర్చడం, నెటిజన్లు సోషల్‌ మీడియాలో అకౌంట్స్‌లో ప్రొఫైల్‌ పిక్చర్‌ను జాతీయ జెండాగా మార్చుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ వినూత్నంగా జాతీయ జెండాను ఎగరేసి దేశం దృష్టిని ఆకర్షించింది. ‘అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ భూభాగానికి మాత్రమే పరిమితం కాదని, సముద్రంలో కూడా అంటూ సముద్రం మధ్యలో జెండాను ఎగరేశారు. వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన మత్య్సకారుల సహకారంతో ఇండియన్‌ కోస్టల్‌ గార్డ్‌.. రెండు పడవల మధ్య తాడు సహాయంతో జెండాను ఎగరేసి, త్రివర్ణ పతకాన్ని గౌరవించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

కోస్టల్ గార్డ్ హర్ ఘర్ తిరంగా వీడియో..

ఇదిలా ఉంటే మొన్నటి మొన్న ఇండియన్‌ కోస్టల్‌ గార్డ్‌ సముద్రం లోపల జెండాను ఎగరేసిన విషయం తెలిసిందే. హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్‌లో భాగంగా సముద్రంలో ఫ్లాగ్‌ డెమోను నిర్వహించారు. ఇది దేశం మొత్తాన్నీ కదిలిస్తోంది. ప్రజల్లో దేశ భక్తిని అది తట్టి లేపుతోందని పేర్కొంటూ ఇండియన్‌ కోస్టల్‌ గార్డ్‌ వీడియోను షేర్‌ చేసింది.

అండర్ వాటర్ ఫ్లాగ్ డెమో..

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..