గుట్కా ఉమ్మేందుకు.. 100 కి.మీ వేగంతో వెళ్తున్న కారు డోర్ ఓపెన్‌ చేశాడు.. ఏమైందంటే..

ఈ ముగ్గురు జూన్ 1 ఆదివారం నాడు జరిగిన లేట్ నైట్ పార్టీకి హాజరయ్యారైనట్టుగా గుర్తించారు. ఈ క్రమంలోనే ఆకాశ్‌తో పాటు మరో యువకుడు చందాని మరో స్నేహితుడు పంకజ్ ఛబ్రాతో కలిసి కారులో తిరిగి వారి ఇళ్లకు బయల్దేరారు. ఆకాశ్‌ కారు నడుపుతుండగా, జాకీ వెనుక కూర్చున్నాడు, పంకజ్ ముందు ప్యాసింజర్ సీటులో కూర్చున్నాడు. ఆ తరువాత జరిగిన ఊహించని మలుపుతో..

గుట్కా ఉమ్మేందుకు.. 100 కి.మీ వేగంతో వెళ్తున్న కారు డోర్ ఓపెన్‌ చేశాడు.. ఏమైందంటే..
Gutkha Spitting

Updated on: Jun 04, 2025 | 1:38 PM

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు స్నేహితులు ఆకాశ్, పంకజ్, జాకీ అనే ముగ్గురు యువకులు ఇన్నోవా కారులో వెళ్తున్నారు. ఆకాశ్‌ కారు నడుపుతున్నాడు. మిగలిన ముగ్గురు కారులోనే కూర్చొని ఉన్నారు. అయితే, ఆకాశ్ 100 కి.మీ వేగంతో కారును నడుపుతూ గుట్కా ఉమ్మేందుకు కార్‌ డోర్ ఓపెన్ చేశాడు. దీంతో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డు పక్కన ఉన్న కార్లపై పడింది. ఈ ప్రమాదంలో జాకీ అక్కడికక్కడే చనిపోగా, మిగతా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మృతుడు బిలాస్‌పూర్ శివార్లలో ఉన్న చకర్‌భటకు చెందిన బట్టల వ్యాపారి జాకీ గెహిగా గుర్తించారు. అయితే, ఈ ముగ్గురు జూన్ 1 ఆదివారం నాడు జరిగిన లేట్ నైట్ పార్టీకి హాజరయ్యారైనట్టుగా గుర్తించారు. ఈ క్రమంలోనే ఆకాశ్‌తో పాటు మరో యువకుడు చందాని మరో స్నేహితుడు పంకజ్ ఛబ్రాతో కలిసి కారులో తిరిగి వారి ఇళ్లకు బయల్దేరారు. ఆకాశ్‌ కారు నడుపుతుండగా, జాకీ వెనుక కూర్చున్నాడు, పంకజ్ ముందు ప్యాసింజర్ సీటులో కూర్చున్నాడు.

డ్రైవర్‌ సీటులో ఉన్న ఆకాష్ అతివేగంగా కారు నడుపుతున్నప్పుడు. 100స్పీడ్‌తో వెళ్తున్న కారులో ఒక్కసారిగా ఆకాశ్‌ కార్‌ డోర్‌ ఓపెన్‌ చేసి గుట్కా ఉమ్మివేసే ప్రయత్నం చేశాడు.. దాంతో కారు పూర్తిగా అదుపుతప్పింది. రోడ్డుపై అడ్డంగా పల్టీలు కొట్టింది. కారు డివైడర్‌ను ఢీకొట్టి, పల్టీలు కొడుతూ అక్కడే ఆగివున్న మారుతి ఎర్టిగా, మరో ఆగివున్న వాహనాన్ని ఢీకొట్టిందని పోలీసులు గుర్తించారు. కేసు నమదు చేసుకున్న పోలీపులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..