Luxury Home Tour: రూ.5 కోట్ల ఖరీదైన ఇళ్లు..! లోపల ఎలా ఉందో చూస్తారా..?

గుర్గావ్ అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటి. ఇక్కడి ఫ్లాట్లు, విల్లాలు, అపార్ట్‌మెంట్ల ధరలు ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారుతున్నాయి.. అయితే, గుర్గావ్‌లో ఒక వ్యక్తి రూ.5 కోట్ల విలువైన ఇంటి హోం టూర్‌ని ఇంటర్‌లో షేర్‌ చేశాడు. దాని ఇంటీరియర్ డిజైన్, విశాలమైన గదులు ప్రజలను ఎంతగానో ఆకర్షించాయి. అయితే, ఈ ఇంటి విలువ రూ.5 కోట్లు ఎలా ఉంటుందని చాలా మంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో ఇక్కడ చూద్దాం..

Luxury Home Tour: రూ.5 కోట్ల ఖరీదైన ఇళ్లు..! లోపల ఎలా ఉందో చూస్తారా..?
Gurugram Luxury Home

Updated on: Dec 17, 2025 | 6:41 PM

వైరల్‌ వీడియోలో ఒక వ్యక్తి గుర్గావ్‌లో అత్యంత ఖరీదైన ఇంటిని చూపిస్తున్నాడు. వీడియోలో ఆ వ్యక్తి లాంజ్ ఏరియా నుండి బాల్కనీ వరకు, పిల్లల గది నుండి మాస్టర్ బెడ్‌రూమ్ వరకు ప్రతిదీ చూపిస్తాడు. అలాంటి ఇంటిని ఇష్టపడే వారిని ఉద్ధేశిస్తూ.. మీ కోసం కాకపోతే, మీ కుటుంబం కోసం డబ్బు సంపాదించండి అని కూడా అతను చెబుతాడు. అయితే, వీడియో కామెంట్‌ సెక్షన్‌లో ఇంటి ధరపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చాలా మంది వినియోగదారులు.

గుర్గావ్‌లో అనేక VIP ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన ఇళ్ళు అందుబాటులో ఉన్నాయి. ఇంటి ధరలో చుట్టుపక్కల ప్రదేశం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి ఇంటి లోపల ఎలా ఉందో చూపిస్తున్నాడు. మొదట అతడు లాంజ్ ఏరియాను చూపిస్తాడు. తరువాత అతను అక్కడ బాల్కనీ, జాకుజీని చూపిస్తాడు. తరువాత, అతను స్టైలిష్ బెడ్‌రూమ్‌ను చూపిస్తాడు. ఆ తరువాత పిల్లల బెడ్‌రూమ్‌ను కూడా చూపించాడు.

ఇవి కూడా చదవండి

పిల్లల బెడ్‌రూమ్‌లో మంచం ఆకు డిజైన్ తో ఉంటుంది. ఆ తరువాత అతను టీవీ నుండి అటాచ్డ్ బాత్రూమ్ వరకు అన్నీ ఉన్న మాస్టర్ బెడ్ రూమ్ కి వెళ్తాడు. ఆ తరువాత అతను వంటగదిలోని డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ని చూపించి నేను ఫ్లాట్ అమ్మడం లేదు.. ప్రేరణ కోసం ఇక్కడికి వచ్చాను అని చెప్పి ముగించాడు. చివరగా, అతను మళ్ళీ మొత్తం ఇంటిని చూపిస్తాడు. దాదాపు రెండు నిమిషాల వీడియో దీనితో ముగుస్తుంది.

వీడియో ఇక్కడ చూడండి…

గుర్గావ్‌లోని ఈ ఇంటిని చూసిన తర్వాత ప్రజలు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇంటి ధర నిజంగా రూ.5 కోట్లు? ఉంటుందా..? మీరు నిజంగా ఖచ్చితంగా చెప్పగలరా? ఇది 5 కోట్లకు కొంచెం ఎక్కువ అనిపిస్తోందని అంటున్నారు. మరికొందరు..ఆ ఏరియాలో అలాంటి ఇంటికి రూ. 5 కోట్లు చాలా తక్కువ అని రాయగా, మరొకరు ఇలా అంటున్నారు.. అక్కడ గాలి విషపూరితమైనది అంటున్నారు. మనం రూ. 5 కోట్లు సంపాదించే సమయానికి ఈ ఇంటి విలువ రూ.20 కోట్లు అవుతుంది అని కూడా చాలా మంది రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..