చాలా మంది తమ వివాహం కోసం వివిధ రకాల కలలు కంటారు. ప్రతి ఒక్కరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుకుంటారు..అదేవిధంగా సంప్రదాయ వివాహాలు చేసుకునే వారికి కొదవలేదు. ఇకపోతే, పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన క్షణం. అలాంటి వివాహాన్ని ప్రత్యేకంగా, ఒక మధురమైన జ్ఞాపకంగా అందరికీ గుర్తుండిపోయేలా చేయడానికి కొన్ని విపరీతమైన ఆలోచనలు చేస్తుంటారు కొందరు వధూవరులు. పెళ్లి చేసుకోవాలని ఓ జంట చేసిన క్రేజీ ఐడియా ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. గుజరాత్‌కు చెందిన ఓ జంట తమ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి వ్యాలీలోని మంచుతో కప్పబడిన పర్వతాలను ఎంచుకుంది. ఈ ప్రదేశం ఎముకలు కొరికే చలితో నిండిఉంటుంది. ఈ జంట మురాంగ్, స్పితిలో తమ వివాహ మండపాన్ని ఏర్పాటు చేయించారు.. ఈ ప్రాంతంలో ఇదే తొలి కళ్యాణ మండపం. ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎముకలు కొరికే చలి, మంచు కురుస్తున్న ప్రాంతంలో ఓ జంట పెళ్లి చేసుకుంటున్న వీడియో ఇది. వధువు కోరిక మేరకు మంచులో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. గుజరాత్‌కు చెందిన ఈ జంట మైనస్ 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో పెళ్లి కోసం పెద్ద సాహసమే చేశారు. మంచులోనే పెళ్లి మండపం ఏర్పాటు చేసుకున్నారు. చలిలోనే పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. తక్కువ మంది బంధుమిత్రులు, పురోహితుడు ఉన్నారు. గడ్డ కట్టుకుపోయే చలిలోనే ఏడడుగులు వేశారు నూతన వధూవరులు. అక్కడే సంతోషంగా మిత్రులు, బంధువులు ఇచ్చిన కానుకలను అందుకున్నారు. ఇలాంటి పెళ్లి వేడుకను మీరు ఎప్పుడూ చూసి ఉండరు. కాగా, ఈ వివాహ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
एक विवाह ऐसा भी! गुजरात का प्रेमी जोड़ा, प्रेमिका की जिद्द ने स्पीति पहुंचाया, फिर माईनस 25 डिग्री तापमान में सजाया मंडप, यह अपने आप में पहली तरह का मामला है।
स्पीति के मुरंग में आज हुआ अनोखा विवाह।
यह है डेस्टिनेशन वेडिंग का example। pic.twitter.com/4lnaRl0c5h— Ajay Banyal (@iAjay_Banyal) February 26, 2024
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అజయ్ బన్యాల్ భాగస్వామ్యం చేసిన వీడియో, వివాహ సమయంలో ఒక ప్రత్యేక క్షణాన్ని చూపుతుంది. మండపంలో భార్యాభర్తలు ఒకరికొకరు వాగ్దానాలు చేసుకుంటూ ఉండటం.. ఆశ్చర్యకరంగా గడ్డకట్టే ఉష్ణోగ్రతల్లో ఈ వేడుక జరగడం విశేషం.
తేలికపాటి మంచు కురుస్తున్న సమయంలో ఈ జంట సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఈ వీడియోలోని మరో విశేషం. ఈ దృశ్యాన్ని సినిమాలో చూడొచ్చు. చలిని తరిమికొట్టేందుకు గ్లౌజులు ధరిస్తున్నారు. నూతన వధూవరులకు “లాంగెస్ట్ రోడ్ ట్రిప్ వెడ్డింగ్ ఎక్స్‌పెడిషన్ ఫాలోయింగ్” అవార్డు లభించింది.
स्पीति के मुरंग में माइनस 25 में डेस्टिनेशन वेडिंग की शानदार रील pic.twitter.com/SRJlJh2GVx
— Ajay Banyal (@iAjay_Banyal) February 27, 2024
స్పితి వ్యాలీలో జరిగిన ఈ విశిష్టమైన పెళ్లి కేవలం డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు మాత్రమే కొత్త బెంచ్‌మార్క్‌ని సెట్ చేసింది. హిమాలయ శీతాకాలపు చలిలో కూడా ఎలాంటి అడ్డంకినైనా అధిగమించే ప్రేమ శక్తికి ఉందనే అందమైన ఉదాహరణగా నిలుస్తోంది ఈ వివాహ వీడియో.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..