AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుర్రం కాదు.. నడిచే సంపద..? విలువ ఎంతో తెలిస్తే మతిపోతుంది గురూ..!

గుజరాత్ లోని సూరత్ లో తాపి హార్స్ షో గత జనవరి 30 నుంచి ఈనెల 2 వరకు పెద్ద ఎత్తున జరిగింది. దేశం లోని వివిధరాష్ట్రాల నుంచి అంటే దాదాపు 900 కిలోమీటర్ల వరకు ప్రయనించి ఈ షో లో గుర్రాలు పాల్గొన్నాయి. వీటికి టెంట్ పెగ్గింగ్ , షో జంపింగ్ , బారెల్ రేసింగ్ వంటి సాహస క్రీడలు , వినోదం కోసం డాన్స్ , మ్యూజికల్ చైర్స్ , గుర్రపు బండి స్వారీల తోపాటు సంప్రదాయ నడక "రేవాల్ వాకింగ్ " వంటి పోటీలు నిర్వహించారు.

గుర్రం కాదు.. నడిచే సంపద..? విలువ ఎంతో తెలిస్తే మతిపోతుంది గురూ..!
Horse Worth
B Ravi Kumar
| Edited By: |

Updated on: Feb 04, 2026 | 12:50 PM

Share

హార్స్ రైడింగ్ అంటే గుర్రపు స్వారీ అనే అనుభూతి అద్భుతంగా ఉంటుంది. మన భారతీయ చిత్రాల్లో పౌరాణికం నుంచి సాంఘిక చిత్రాల వరకు హీరోలు , హీరోఇన్ లు గుర్రం మీద వెలుతూ చేసే ఛేజింగ్ , కత్తి యుద్దాలు , ఫైటింగ్ సీన్స్ చాలా ఆసక్తికరంగా ఉండటంతో పాటు ప్రేక్షకులను ఉర్రూత లూగిస్తుంటాయి. దీనికోసం నటీనటులు ప్రత్యేకంగా హార్స్ రైడింగ్ లో శిక్షణ తీసుకుంటారు.

ఇక గుజరాత్ లోని సూరత్ లో తాపి హార్స్ షో గత జనవరి 30 నుంచి ఈనెల 2 వరకు పెద్ద ఎత్తున జరిగింది. ఈ అతి పెద్ద కార్యక్రమంలో 200లకు పైగా అశ్వాలు పాల్గొన్నాయి. నైపుణ్యం గల రైడర్లు అత్యంత ప్రతిభావంతంగా తమ తమ ప్రదర్శనలను ఇచ్చారు. చాలా అరుదైన గుర్రాల జాతుల ప్రదర్శన ఇందులో చోటు చేసుకోవటంతో సందర్శకులు తన్మయత్వం చెందారు. కుటుంబాలతో సహా ఈ షోకి వచ్చి పిల్లలతో గుర్రాలముందు ఫోజులు ఇచ్చారు. వివిధ ప్రాంతాలకు చెందిన ఫోటోగ్రాఫర్స్ గుర్రాల అందచందాలు , ప్రతిభలను తమకెరాల్లో బంధించి మంత్ర ముగ్ధులు అయ్యారు. ఈ ప్రదర్శనను సూరత్ హార్స్ సొసైటీ నిర్వహించగా తాపి రివర్ ఫ్రంట్ కేబుల్ బ్రిడ్జ్ దిగువ ప్రాంతంలో జరిగింది.

రూ. 4.50 కోట్లు పలికిన బ్రహ్మోస్:

ఇవి కూడా చదవండి

నల్లని గుర్రం – బ్లాక్ హార్స్ అసలు పేరు బ్రహ్మోస్. సూరత్ లో పుట్టిన ఈ గుర్రం వయస్సు 3.5 సంవత్సరాలు. పంజాబ్ కు చెందిన ఒక ప్రముఖ రాజకీయ కుటుంబం దీన్ని రూ 4.50కోట్లకు కొనుగోలు చేయటం ఆసక్తికరంగా మారింది. ఇదే షో లో పాల్గొన్న మరో మార్వారీ జాతికి చెందిన గుర్రం “లక్ష్మి” కూడా మంచి ధరకు అమ్ముడు పోయింది. 5 సంవత్సరాల వయస్సు , 60 అంగుళాల ఎత్తువున్న ఈ వున్న ఈ గుర్రాన్ని రూ 1.11 కోట్లకు కొనుగోలు చేశారు. వాటికి ఉన్న పొటన్షియాలిటీ , సామర్ధ్యం ఆధారంగా వాటికోసం కోట్లరూపాలను వెచ్చించారు కొనుగోలుదారులు. దేశం లోని వివిధరాష్ట్రాల నుంచి అంటే దాదాపు 900 కిలోమీటర్ల వరకు ప్రయనించి ఈ షో లో గుర్రాలు పాల్గొన్నాయి. వీటికి టెంట్ పెగ్గింగ్ , షో జంపింగ్ , బారెల్ రేసింగ్ వంటి సాహస క్రీడలు , వినోదం కోసం డాన్స్ , మ్యూజికల్ చైర్స్ , గుర్రపు బండి స్వారీల తోపాటు సంప్రదాయ నడక “రేవాల్ వాకింగ్ ” వంటి పోటీలు నిర్వహించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..