Video: గుజరాత్ సింగర్‌పై డాలర్ల వర్షం.. ఉక్రెయిన్‌కు గీతాబెన్‌ రూ.2.5 కోట్ల విరాళం..

|

Mar 29, 2022 | 12:01 PM

Geetaben: ఉక్రెయిన్‌పై రష్యా పోరు మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌కు సాయంగా అనేక దేశాల్లోని ప్రజలు సాయంగా నిలుస్తున్నారు. అమెరికాలో నివసించే NRIలు కూడా ఆ దేశానికి సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నిధుల సేకరణ కోసం గుజరాతీ..

Video: గుజరాత్ సింగర్‌పై డాలర్ల వర్షం.. ఉక్రెయిన్‌కు గీతాబెన్‌ రూ.2.5 కోట్ల విరాళం..
Geetaben
Follow us on

ఉక్రెయిన్‌పై రష్యా పోరు(Russia Ukraine War) మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌కు సాయంగా అనేక దేశాల్లోని ప్రజలు సాయంగా నిలుస్తున్నారు. అమెరికాలో నివసించే NRIలు కూడా ఆ దేశానికి సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నిధుల సేకరణ కోసం గుజరాతీ NRIలు జార్జియా, అట్లాంటాలో లైవ్‌ షోలు ఏర్పాటు చేశారు. గుజరాతీ జానపద గాయని గీతాబెన్‌ రాబరితో(Geetaben) సంగీత కచేరీ నిర్వహించారు. లోక్‌ దేరో’ పేరుతో నిర్వహించిన ఈ షోకు విశేష స్పందన వచ్చింది. ఈ రెండు కార్యక్రమాలకు భారీగా హాజరైన NRIలు సింగర్‌పై డాలర్ల వర్షం కురిపించారు. దీంతో స్టేజీ మొత్తం కరెన్సీ నోట్లతో నిండిపోయింది. ఆ ఫొటోలను గీతాబెన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఈ రెండు షోల్లో భారీగా నిధులు సమకూరినట్లు కార్యక్రమాల నిర్వహించిన సూరత్ ల్యూవా పటేల్ సమాజ్ వెల్లడించింది. మొత్తం 3లక్షల డాలర్లు విరాళంగా అందినట్లు తెలిపింది. వీటిని ఉక్రెయిన్‌కు ఇస్తామని వెల్లడించారు.

సింగర్‌ గీతాబెన్‌ రాబరి భారత్‌తోపాటు విదేశాల్లోనూ ఇప్పటివరకు అనేక ప్రదర్శనలు ఇచ్చి అలరించారు. స్వరాష్ట్రం గుజరాత్‌లో ఆమెకు విశేష ఫాలోయింగ్‌ ఉంది. 2020 ఫిబ్రవరిలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎదుట గాన కచేరీ చేసి మెప్పించారు.


ఇవి కూడా చదవండి: Gangster Naeem: గ్యాంగ్​స్టర్​ నయీం బినామీల ఆస్తులపై ఐటీ శాఖ నజర్‌.. 150 కోట్ల విలువైన ఆస్తులు సీజ్‌..

ఈ ఫోటోలో ఎన్ని చిత్రాలు ఉన్నాయో గుర్తుపట్టండి చూద్దాం.. మీరు మొదట చూసేదే మీ వ్యక్తిత్వం..